Saturday, July 27, 2024
spot_img
HomeNewsAndhra Pradeshలోక సభలో రాహుల్ గాంధీ …Opposistion in Josh

లోక సభలో రాహుల్ గాంధీ …Opposistion in Josh

Congress పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు ప్రకటించింది. రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంట్‌లోకి లోక్‌సభ సభ్యుడిగా అడుగుపెట్టారు. సూరత్‌ ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాహుల్ సభ్వత్వాన్ని పునరుద్దరించారు.


ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నేడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అటు మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబడుతోన్న విపక్షాలు.. అందుకు అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8వ తేదీ (మంగళవారం) నుంచి లోక్‌సభలో చర్చ జరగనుంది.

Speaker Secretariat


ఈరోజు పార్లెమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ పాల్గొన్నారు . ఇక రేపు జరిగే చర్చలోనూ రాహుల్ పాల్గొననున్నారు. పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ నేతలు శుక్రవారమే అందజేశారు. అలాగే, రాహుల్‌ అనర్హతను రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి స్పీకర్ టేబుల్‌ ముందుంచడంతో ఆయన వీటిపై సోమవారం సంతకాలు చేశారు. దీంతో వాయనాడ్ ఎంపీగా రాహుల్‌ మళ్లీ సభలోకి ప్రవేశించారు . .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments