మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు నటుడు మంచు మనోజ్ రాజకీయ అరంగ్రేటం చెయ్యడం ఖరారు అయుంది . దీనికి వేదిక గా తన తండ్రి వెళ్లిన బాటలోనే అదే తెదేపా లో జాయిన్ అవ్వడం ద్వారా రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనున్నారు . మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనికా రెడ్డి ని విహహం చేసుకున్నారు . భూమా మౌనికా రెడ్డి భూమా నాగిరెడ్డి , శోభా నాగిరెడ్డి ల చిన్న కుమార్తె . భూమా దంపతులకు కర్నూలు జిల్లా లో వున్న పట్టు తెలిసిందే . ఇక మౌనికా రెడ్డి అక్క అఖిల ప్రియ మాజీ మంత్రి . ఆమె కూడా తెదేపా లోనే వున్నారు . ఇక సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి , కజిన్ భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా తెదేపా లోనే కొనసాహుతున్నారు .
మంచు మనోజ్ తండి మోహన్ బాబుది చిత్తూరు జిల్లా . ఇక్కడే ఆయన విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ సంష్తలు నడుపుతున్నారు. అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో మౌనికా రెడ్డి తో కలసి భేటీ అనంతరం , హీరో మంచు మనోజ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు .
చంద్రబాబు గారు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఎంతో ప్రేమ, అభిమానం ఉంటుంది. మేమంటే ఎంతో అభిమానం. పెళ్లి తర్వత చంద్రబాబును కలవాలని చాలా సందర్భాల్లో అనుకున్నాం, కానీ కుదరలేదు. ఆయన బిజీగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. ఈరోజు ఫోన్ చేసి రమ్మన్నారు.. మర్యాదపూర్వకంగా మా బాబుతో కలిసి వెళ్లి కలిశాం కలసి ఆసిర్వాదం తీసుకొన్నాం . ఇది క్యాజువల్ మీటింగ్ అయినా , కలిసిన వారికి రాజకీయ నేపథ్యం వుంది, రాజకీయ ఆశలు కూడా వున్నాయి .
భూమా అఖిల ప్రియా ఆళ్ళగడ్డ నుంచీ MLA గా గెలిచి అక్కడే ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నారు . భూమా కు సన్నిహితుడైన సుబ్బారెడ్డి తో వున్నా విభేదాలు సరిచెయ్యలేని విధం గా వున్నాయి. ఇక ఇద్దరు అక్కాచెల్లేల కు ఆళ్ళగడ్డ , నంద్యాల స్థానాలు ఇవ్వక పోవచ్చు . నంద్యాలలో భూమా సోదరులలో ఒకరికి ఇచ్చి , ఆళ్లగడ్డ లో మౌనికా రెడ్డి కి ఇచ్చే అవకాశాలు లేక పోలేదు . ఆ విధంగా అయితే సుబ్బారెడ్డి వర్గానికి అభ్యంతరం ఉండదనేది ఒక వాదన వినిపిస్తోంది .
ఇక మంచు మనోజ్ ను తెదేపా స్టార్ కాంపైనర్ గా చేసి రాష్ట్రమంతా తిరిగే అవకాశం వుంది అనికూడా వార్తలు వస్తున్నాయి .లేదా చిత్తూరు జిల్లా లో ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం (చంద్రగిరి ) నుంచీ పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు . మంచు మనోజ్ నందమూరి బాలకృష్ణ తో సన్నిహిత సంభందాలు వున్నా విషయం తెలిసిందే కదా . ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో మంచు కుటుంబం నుంచీ పవర్ ప్యాకెడ్ పొలిటికల్ ఎంట్రీలు ఖాయమని తెలుస్తోంది .. ఎప్పుడు … ఎలా … కోసం వేచి చూద్దాం మరి ..!