[ad_1]
గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొ ల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వా రా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిత్ర ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్, వర్ష బొల్ల మ్మ, నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
[ad_2]