[ad_1]
అల్లు శిరీష్, అందాల బ్యూటీ అను ఇమాన్యుల్ కలిసి జంటగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ మూవీకి మొదట ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు టైటిల్ మార్చి ‘ఉర్వశివో రాక్షసీవో’ అని ఖరారు చేశారు. ఈ మూవీని న్యూ డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్తం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో శిరీష్, అనుల రొమాన్స్ తోపాటు వెన్నెల కిశోర్, పోసాని ఫన్ డైలాగ్స్ విడుదలైన ఈ టీజర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
[ad_2]