Wednesday, December 11, 2024
spot_img
HomeNewsమామ అల్లుళ్ళు దొందు దొందే

మామ అల్లుళ్ళు దొందు దొందే

మామ అల్లుళ్ళు దొందు దొందే

తానా అంటే తందనానా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నువ్వా నేనా అన్నట్లు నడుస్తున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది .
ఒకరిపై ఒకరు ఆరోపణల అస్త్రాలు సందించుకుంటున్నారు . ముఖ్యంగా కృష్ణా జలాలు ప్రాజెక్టులపైనే ప్రధాన చర్చ జరుగుతోంది.
ప్రాజెక్టులు పేరుతో బారాసా ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు.
అయితే నేటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్
చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలైనా తెలంగాణ జాతిపిత సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారంటూ గులాబీ దళపతిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన జాతిపిత, సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు సీఎం .
తెలంగాణకు కృష్ణా జలాలు ప్రాణప్రదాయమని గుర్తు చేస్తూ మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు కృష్ణా జలాల పై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి .
ముఖ్యవిషయం ఏమిటంటే ఈ రోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గులాబీ దళపతి కేసీఆర్ కుర్చీ మొన్నటి వరకూ ఖాళీగా ఉన్న విషయం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే .
ఈ రోజు నుంచి కెసిఆర్ సీట్లో పద్మారావు కూర్చున్నారు. పద్మరావు అన్న ఉద్యమ కారుడని, ఆయనకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏంటో ఉందని నిండు సభలో సీఎం రేవంత్ తెలిపారు.
ఆ సీటులో పద్మన్న కూర్చోవటం నాకు చాలా సంతోషంగా ఉందని, ఆ సీటు పద్మన్నకు ఇవ్వడం మంచిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
అంతే కాకుండా ఇదే రోజు సీఎం రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీశ్‌ రావు మాయ మాటలు ,పచ్చి అబద్ధాలు చెబుతారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మామ అల్లుళ్ళు దొందు దొందే అని సీఎం రేవంత్ రెడ్డి చమత్కరించారు . దీంతో హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్‌ రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని హరీశ్రావు సెటైర్ వేశారు.
ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ దూషించుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్‌ నుంచి తరిమి తరిమికొడితే మహబూబ్‌నగర్‌ వాస్తవ్యులు ఎంపీగా గెలిపించారంటే అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments