Saturday, July 27, 2024
spot_img
HomeElections 2023-202417 మందితో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి లిస్ట్ ఇదే..?

17 మందితో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి లిస్ట్ ఇదే..?

లోక్ సభ సమరానికి సిద్దమవుతున్న.. తెలంగాణ కాంగ్రెస్
సీఎం రేవంత్ ప్రకటనతో… కాంగ్రెస్ నేతల్లో సరికొత్త జోష్
17 పార్లమెంట్ స్థానాలకు.. 14 సీట్లు విజయమే కాంగ్రెస్ లక్ష్యం
ముందే మహబూబ్ నగర్.. రేసు గుర్రాన్ని ప్రకటించిన సీఎం సాబ్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులెవరు? ఛాన్స్ దక్కేదెవరికి..?

తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలు పెట్టాయి. ఐతే తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమరానికి తెలంగాణ కాంగ్రెస్ రెడీ అవుతోంది అని గాంధీ భవన్ వర్గాల టాక్. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే లోక్ సభ కోసం ముందుగానే మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ కొడంగల్ సభలో ప్రకటించేశారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.

This is the first list of Congress MP candidates with 17 people..?

ఇప్పటికే లోక్ సభ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్.. ఆ తర్వాతి ప్రక్రియలు అన్నింటినీ పక్కన పెట్టి.. ముందుగా కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించింది. అసెంబ్లీ ఫలితాల తరహాలోనే ఈ సారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల విజయమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్చ తీసుకుని అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఐతే
షెడ్యూల్ నాటికి పరిస్థితులని బట్టి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంతకీ.. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులెవరు? ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ దక్కనుంది ? అనేది పరిశీలిద్దాం

లోక్ సభ ఎన్నికల కోసం.. టీ కాంగ్రెస్ రేసుగుర్రాలు వీళ్లే?

హైదరాబాద్ – సమీర్ ఉల్లా
సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్
చేవెళ్ల- పట్నం సునీతారెడ్డి
మల్కాజ్ గిరి – కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
మెదక్- మైనంపల్లి హనుమంతరావు
ఖమ్మం – మల్లు నందిని లేదా పొంగులేటి ప్రసాద్ రెడ్డి
జహీరాబాద్ – సురేశ్ షెట్కార్
పెద్దపల్లి – వెంకటేశ్ నేత
నిజామాబాద్ – జీవన్ రెడ్డి
నల్గొండ – జానారెడ్డి లేదా పటేల్ రమేశ్ రెడ్డి
భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి
కరీంనగర్ – ప్రవీణ్ రెడ్డి
ఆదిలాబాద్ – రేఖా నాయక్
మహబూబాబాద్ – బలరాం నాయక్
వరంగల్ – అద్దంకి దయాకర్
నాగర్ కర్నూలు – సంపత్ కుమార్ లేదా మల్లు రవి
మహబూబ్ నగర్ – చల్లా వంశీ చంద్ రెడ్డి పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులెవరో..? ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ దక్కనుందో త్వరలోనే తేలిపోతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments