అప్పుడే పుట్టిన పిల్లలు లేదా నెలలు వయసు ఉన్న పిల్లల్లను శిశువుగా చూస్తాము వీరికి ఆహారము తల్లిపాలు,తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేయస్కరము , తల్లిపాలతో శిశువుకి అందాల్సిన శక్తీ మరియు అన్ని పోషకాలు ఉంటాయి ,తల్లిపాలు చిన్న పిల్లలకు సంజీవనిలాగా పనిచేస్తాయి.
ఈ తల్లిపాలు తాగటం వలన చిన్న పిల్లలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక సంవత్చరం వరకు తల్లిపాలు మాత్రమే తమ బిడ్డలకు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు.తల్లిపాలు ఇవ్వటం వలన భవిష్యత్లో పిల్లలకు కాన్సర్ మరియు ప్రాణాంతక వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండ బిడ్డలు ఆనందముగా ఉంటారు .
కనీసం రెండు సంవత్సరముల వరకు చిన్న పిల్లలకు ఇతర ఆహారపదార్థములతో పాటు తల్లి పాలు కూడా ఇవ్వటంవలన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యముతో ఉంటారు .