రేవంత్ రెడ్డికి గుడి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్స్ లో రేవంత్ రెడ్డి ఒకరు. ఇంకా గట్టిగా నొక్కి చెప్పాలంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం అనంతరం రేవంత్ రెడ్డి రేంజ్ ఒక్కసారిగా అమాంతముగా పేరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ మాస్ లీడర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి టాప్ ప్లేస్ లో ఉన్నారన్నా ఆశర్య పోవలసిన పని లేదు . మాస్ లీడర్స్ లో రేవంత్ రెడ్డి ఒకరు అన్న ఈ స్టేట్ మెంట్ బీఆరెస్స్ బీజేపీ వర్గాలకు నచ్చకపోయినా ఇది పచ్చి నిజం అనే వారే ఎక్కువ మంది ఉన్నారు .
ఈ సందర్భముగా సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది కూడా సూర్యాపేట జిల్లా వనిపాకల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డికి గుడికట్టబోతున్నట్లు సమాచారం ,అది కూడా స్వయముగా రెడ్డి సంఘం ప్రతినిధి మేడి సంతోష్ ప్రకటించారు. గుడికి సంబంధించిన శంకుస్థాపన పూజ కార్యక్రమం ఈ నెల 19న జరగనుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి గుడి అన్న విషయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారి హల్ చల్ చేస్తు సెన్సేషనల్ న్యూస్ గ మారింది .
నిజం చెప్పాలి అంటే సినిమా వాళ్లకు, బ్రతికున్న నేతలకు,తల్లితండ్రులకు గుర్తుగా గుడి కట్టే సంస్కృతి మనం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రములో చూస్తూ ఉంటాము . కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ మనిషికి గుడి కట్టే సంస్కృతి ప్రారంభము అయినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగ ఇప్పుడు సూర్యాపేట జిల్లా వనిపాకల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టబోతున్నారు రెడ్డి సంఘం ప్రతినిధి మేడి సంతోష్.