Friday, July 12, 2024
spot_img
HomeElections 2023-2024మా ప్రభుత్వ పనితీరే రెఫరెండం

మా ప్రభుత్వ పనితీరే రెఫరెండం

మా ప్రభుత్వ పనితీరే రెఫరెండం,రేవంత్ సంచలన వ్యాఖ్యలు,ప్రజలను ఒకటే కోరుతున్న పాలన చూసి ఓటేయండి,పార్లమెంటు ఎన్నికలను రెఫరెండమ్‌గానే భావిస్తున్నాం,లోక్‌సభ ఎన్నికల్లో భారాస, భాజపా కుమ్మక్కు అయ్యారు

రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పడం సీఎంగా నా బాధ్యత ‘‘మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోంది. మేం ప్రతి ఒక్కరి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేడు పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ తేదీవరకు మా ప్రభుత్వ పరిపాలనను కొలమానంగా పెట్టుకొని ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నాం . పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను గెలవడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు . లోక్ సభ ఎన్నికల్లో భాజపా, భారాసా లు ఇద్దరు ఒక అవగాహన ఒప్పందంతో కలిసి పోటీ చేస్తున్నాయనడానికి ఆ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు, నియోజకవర్గాలను పరిశీలిస్తే ప్రజలకు అర్థమవుతోందని విమర్శించారు. సెక్రటేరియట్ లో నిన్న సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.కాంగ్రెస్‌కు బలమున్నచోట భారాస అభ్యర్థులు , మిగిలిన చోట భాజపా అభ్యర్థులకు వదిలేశారని ఆరోపించారు. చేవెళ్ల,మెదక్ లో గులాబీ పార్టీ ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదని రేవంత్‌ ప్రశ్నించారు . అసలు అసెంబ్లీకె రాని గులాబీ దళపతి కేసీఆర్‌ను ప్రతిపక్షనేతగా ఎలా అనుకోమంటారని నిలదీశారు . పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ , భారాస కలిసి పోటీ చేయడంపై రేవంత్ మాట్లాడుతూ వాళ్ల నిజ స్వరూపాలు ప్రజలకు తెలిశాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలను మా మూడు నెలల సుపరిపాలనను రెఫరెండంగా భావించవచ్చు అని అన్నారు సీఎం రేవంత్ .

A referendum on the performance of our government

దేశంలోని అన్ని రాష్ట్రాలకూ దేశ ప్రధాని పెద్దన్న లాంటివారు. మోదీని పెద్దన్న అనడంలో తప్పేముంది? నేను పెద్దఅన్న అంటే తప్ప ? రాహుల్‌గాంధీ ఏ మా నాయకుడు. నరేంద్ర మోదీని నేనెందుకు పొగుడుతాను? ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక సీఎంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రానికి అవసరమైన పనుల గురించి బహిరంగసభలోనే చెప్పాను . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. గుజరాత్‌లోని సబర్మతి నది లాగ మూసీ నది అభివృద్ధి, హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ పనులకు సహకరించాలని కోరాను. కుమారుడిని సీఎం చేయమని అడగలేదు,కుటుంబ పార్టీని కాపాడమని అడగలేదు నేనేమీ గులాబీ దళపతి కేసీఆర్‌లా చెవిలో గుసగుసలాడలేదు అన్నారు సీఎం రేవంత్ . ముందు మా కుటుంబంలో ఎవరికీ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదు అని సీఎం రేవంత్ స్పష్టం చేసారు . బిఆర్ స్ పాలనలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీతో విచారణకు ఆదేశించాను, విచారణకు అధికారులను నియమించాలంటే ఆ ప్రాజెక్టు అవినీతిలో పాలుపంచుకున్న వారే 99% మంది ఉన్నారు. మళ్లీ వారితోనే ఎలా విచారణ చేయించమంటారు ? నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కాళేశ్వరం, విద్యుత్‌ ఒప్పందాలపై విచారణ చేయించడానికి సిటింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ సిటింగ్‌ జడ్జిని ఇవ్వడం కుదరదు అని రిటైర్డ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఆదేశించారు .

కేసీఆర్‌లా నేనేమీ 80 వేల పుస్తకాలు చదవలేదు. నరేంద్ర మోదీలా విశ్వగురువునూ కాదు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బిఆర్ స్ ను ఇంట్లో కూర్చోబెట్టారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు
ముగ్గురు మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీరు విడుదల చేయమంటున్నారు .మేడిగడ్డ నుంచి నీళ్లు విడుదల చేస్తే అన్నారంలోకి వస్తాయి. అన్నారం లీకవుతుంటే నీరు వదిలిపెట్టాం.
మేడిగడ్డలో నీళ్లు నింపినపుడు,ఆ ప్రవాహానికి పిల్లర్లు తెగిపోయి ఊళ్లు కొట్టుకుపోతే ఎవరు రెస్పాన్స్ బిలిటీ తీసుకుంటారు ? కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఈ ముగ్గురు మాదే రెస్పాన్స్ బిలిటీ అంటూ అఫిడవిట్‌ రాసిస్తారా? బారాసా హయాంలో ఇసుకపై రోజుకు రూ.కోటి రూపాయలు వస్తే .. ఇప్పుడు మా హయాంలో రూ.3.5 కోట్లకు పెరిగింది. జీఎస్టీ రూపంలో రూ.500 కోట్లు అదనంగా వస్తుంది . ప్రతి వ్యవస్థలోనూ గత బిఆర్ స్ ప్రభుత్వం కుమ్మక్కై లంచాలు మెక్కి సంస్థలను నిర్వీర్యం చేసారు .నేడు రూ.1000 కోట్ల వసూళ్లు పెరిగాయి. జీఎస్టీలో మెయిన్ బిఆర్ స్ నేతలే దోపిడీ దొంగలు. ఆ జాబితాను త్వరలో విడుదల చేస్తాం. మద్యం షాపుల్లో కుంభకోణం ,గొర్రెల పంపిణీ, అమరుల స్మారకం,సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణము ,ఒకటేమిటి గత ప్రభుత్వ అన్ని నిర్మాణాలపై విచారణ జరుపుతాం లెక్కలు బొక్కలు బయటికి తీస్తా ప్రజల ముందు ఉంచుతా అని సీఎం రేవంత్ స్పష్టం చేసారు .

ఒకటి మాత్రం గట్టిగ చెపుతున్న,మా ప్రభుత్వం పారదర్శక పాలన ప్రజలకు అందిస్తోంది,తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతున్న పరిపాలన చూసి ఓటేయండి,పార్లమెంటు ఎన్నికలను రెఫరెండమ్‌గానే భావిస్తున్నాం,కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పెన్నిధి,పేదల కోసం పనిచేయడమే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము అని భావోద్వేగానికి లోనయ్యారు సీఎం రేవంత్ .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments