ఎన్నికలొస్తే ఆగం కావద్దు. మన రాతను మనమే రాసుకునే గొప్ప ఆయుధమే ఓటు… ధరణి వల్ల 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయు . 5 నిమిషాల్లో మ్యుటేషన్ పూర్తవుతుందని తెలిపారు. ధరణి అంటే ప్రభుత్వం వద్ద ఉన్న పవర్‌ను తొలగించి, రైతుల బొటనవేలుకు ఇవ్వడమే…ధరణిని తీసేస్తామన్న వాళ్లను గంగలో కలపాలి ..కాంగ్రెస్ వస్తే పైరవీకారులదే రాజ్యము . ఏ పని కోసం ఆఫీ్‌సకు వెళ్లినా రోజుల తరబడి వేచి ఉండాల్సిందే….. కాంగ్రె్‌సకు చెందిన ఓ పుణ్యాత్ముడు ఇటీవల జిల్లాలో పాదయాత్ర చేస్తూ సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు ఎక్కడ వచ్చా యో చూపించాలంటూ సవాల్ విసిరాడు .. గ్రామగ్రామానికి వెళితే కాల్వల్లో పారుతూ కనిపిస్తాయు …
మళ్ళీ వచ్చేది మేమె ..అద్భుతంగా గెలువబోతున్నాము .. ఈసారి గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయి . సభలో నేను చెప్పిన విషయాలను ఇక్కడే వదిలేయకుండా గ్రామాలకు పోయి చర్చ పెట్టండి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్తోళ్లు కాదు. వాళ్లు ఆకు పసరు తాగినట్టుంది. ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారు. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా?…
కరోనా రావడం, మోదీ నోట్ల రద్దు చేయడంతో ఆలస్యం జరిగినప్పటికీ రూ.37 వేల కోట్లతో రెండు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభు త్వం తమదే నన్నారు కెసిఆర్ . సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కెసిఆర్ , అక్కడ జరిగిన బహిరంగసభలో ఈ పై మాటలను అన్నారు . యధావిధిగా ప్రతిపక్ష నేతలను సీఎం పర్యటన సందర్భంగా హౌస్ అరెస్టు చేశారు .