Vallepalli Sasikanth is Chairman Elect for TANA Foundation : తానా ఫౌండేషన్ చైర్మన్‌గా వల్లేపల్లి శశికాంత్ ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ .. వీరు ప్రస్తుతం బోస్టన్‌లో స్థిరపడ్డారు. ఫౌండేషన్ కార్యదర్శిగా న్యూజెర్సీకి చెందిన విద్యాధర్ గారపాటి, సహాయ కోశాధికారిగా అట్లాంటాకు చెందిన గోగినేని కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకు చెందిన మద్దినేని వినయ్ ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ కార్యక్రమాలను పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని వల్లేపల్లి శశికాంత్ అన్నారు. శశికాంత్ గతంలోనూ ఆయన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ సమయం లో తెలుగు ప్రజలకు తనవంతు సహాయ సహకారాన్ని అందించారు.

తానా ప్రెసిడెంట్, అంజయ్య చౌదరి లావు కొత్త ఫౌండేషన్ నాయకత్వాన్ని అభినందించారు మరియు ఉత్తర అమెరికా మరియు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలలో వారితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు.
