Sunday, September 8, 2024
spot_img
HomeNewsAndhra Pradeshవీరులారా , రైతుకూలీ బిడ్డలారా ... జర భద్రం కొడుకో అంటూ సెలవు తీసుకొన్న...

వీరులారా , రైతుకూలీ బిడ్డలారా … జర భద్రం కొడుకో అంటూ సెలవు తీసుకొన్న ప్రజా యుద్ధ నౌక “గద్దర్ “

ప్రజా యుద్ధ నౌక గద్దర్ దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 6 ఆగస్టు 2023న హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో మరణించారు . గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు . మెదక్ జిల్లా తూప్రాన్ లో ఆయన నిరుపేద కుటుంబం లో శేషుమయ్య , లచ్చుమమ్మ లకు జన్మించారు . భార్య విమలా గద్దర్ . కురుతే పేరు వెన్నెల . కుమారుడు చంద్రుడు ( 2012 లో చనిపోయారు)మరో కుమారుడు సూర్య కిరణ్ .

గద్దర్ విద్యాభ్యాసం హైదరాబాద్ లో , నిజామాబాదు(బోధన్) లలో జరిగింది . ఇక ఆయన REC W లో BE మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు . గదర్ అంటే విప్లవం : యూరోప్ దేశాలలో స్థిరపడ్డ పంజాబీ భారతీయ సంతతి కి చెందిన భారతీయ దేశభక్తులు . . భారతదేశం లో బ్రిటీష్ పాలన అంతానికి .. ప్రవాసం లోనే నడిపిన రహస్య పత్రిక గదర్ . ఆ పేరును తన పేరు గా మార్చుకున్న గుమ్మడి విఠల్ రావు .

కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్. ఆర్‌ నారాయణమూర్తి నటించిన ఓరేయ్ రిక్షా సినిమాలో గద్దర్‌ రాసిన మల్లెతీగకు పందిరి వోలే పాట ఆల్‌టైమ్‌ ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్‌. పొడుస్తున్న పొద్దు మీద పాటతో గద్దర్‌ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారనడం లో ఎలాంటి సందేహం లేదు . పీపుల్స్ వార్ తో కలసి ఆయన కొంతకాలం సాంస్కృతిక విభాగం ఐన జన నాట్యమండలి యొక్క వ్యవస్థాపక సభ్యుడు.

రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో గడ్డ పాల్గొని సంచలనం సృష్టించారు . అనారోగ్యం గా వున్నా గద్దర్ ను పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో పరామర్శించిన సంగతి తెలిసిందే . ఈరోజు పార్థివ దేహం LB స్టేడియం లో ఉంటుంది . రేపు 12 గంటల వరకూ అక్కడే ఉంటుంది . తదుపరి అంత్యక్రియలు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments