Saturday, July 27, 2024
spot_img
HomeNewsNationalమణిపూర్ దారుణం పై ద్దద్దరిల్లిన కొత్త పార్లమెంట్ ...

మణిపూర్ దారుణం పై ద్దద్దరిల్లిన కొత్త పార్లమెంట్ …

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం లో లోకసభ రాజ్జసభ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి . మణిపూర్ లో మహిళల పై జరిగిన అమానవీయ దాడి ఉదంతం ఈ సమావేశాలను కుదిపివేసింది . ఇరు సభల్లోనూ ప్రతిపక్షాలు భాజాపా ను నిలదీశాయి . సభలో చర్చ కు పట్టుపడుతూ వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టాయి . ప్రతిపక్షాలన్నీ ఏక తాటిపై భాజాపా ను నిలదీసాయి.

ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి . దీనితో రాజ్జసభ రెండు సార్లు , లోకసభ ఒకసారి వాయిదా పడ్డాయి . ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రం గా గళమెత్తాయి. ఉభయ సభల్లో చర్చ కోసం పట్టు పట్టాయి .. ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌పై సభకు సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి.

‘మణిపూర్‌, మణిపూర్‌, మణిపూర్‌ కాలిపోతోంది’’ అంటూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడం తో స్పీకర్‌ గత్యంతరం లేక సభను శుక్రవారానికి వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి హోం మంత్రి అమిత్ షా దీని పై సమాధానం ఇస్తారని తెలిపారు . 26 పార్టీల కూటమికి ‘ఇండియా’గా పేరు పెట్టిన తర్వాత తొలి భేటీ మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో జరిగింది . ‘‘ప్రధాని ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇవాళ పార్లమెంటు బయట ప్రకటన చేశారు. ఇది సభను అవమానించడమే. పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలని, మోదీ ప్రకటన చేయాలని మేం కోరుకుంటున్నాం’’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు.

భారతీయ భావజాలంపై జరిగిన దాడిగా మణిపూర్ ఉదంతాన్ని రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. దీనిపై ‘ఇండియా’ కూటమి మౌనంగా ఉండబోదని రాహుల్పే స్పష్టం చేశారు . మణిపూర్‌కు అండగా ఉంటామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments