Thursday, December 26, 2024
spot_img
HomeEditorialస్నేహనికి ఒక రోజు ... మీరూ మీ స్నేహితులతో ...!

స్నేహనికి ఒక రోజు … మీరూ మీ స్నేహితులతో …!

స్నేహం: స్నేహ బంధం కేవలం ఇచ్చి-పుచ్చుకోటం కన్నా గొప్ప బంధం అంటారు సద్గురు  … నిజానికి అది జీవితంతో పెనవేసుకున్న బంధం. నిజానికి స్నేహం ఓక అనుభూతి. మధురమైన అనుభూతి . కన్నవారితోను , కట్టుకున్నవారితోను , తోడబుట్టిన వారితోను చెప్పుకోలేని అనేక విషయాలను స్నేహితులతో పంచుకోవడం దాని యొక్క గొప్పదనం . చాలా మంది ఎవరినన్నా ప్రసన్నం చేసుకోవాలి అంటే వారి స్నేహితులతో ముందు మాట కలిపి వారిని ప్రసన్నం చేసుకొంటారు . ఈ అనుభూతి బాల్యం నుండీ వృద్ధాప్యం వరకూ ఉంటుంది . ఈ అనుభూతి అనుభవిస్తేనే తెలిసేది . ఒక మరణం సంభవిస్తే , లేదా ఆపద కలిగితే ముందుగా వచ్చేవారు మీ స్నేహితులే .

కష్టసుఖాల్లో అండగా ఉంటూ, నిస్వార్థంగా సాయం చేసేవాడిని ఆప్త మిత్రుడు అంటారు . 

ఈ స్నేహానికి వయసు , భాష , ప్రాంతము , కులము , మతము , లింగ, ఆర్ధిక స్థితిగతుల తో ఏ మాత్రం సంభంధం ఉండదు . స్నేహం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఘటనలను చరిత్రలో ఎన్నో చూసాం . మానను సృషించిన దేవుడు అమ్మా నాన్న లను, జన్మ బంధువులను , తోబుట్టిన వారిని ఇస్తే స్నేహితులను మాత్రం ఎంచుకొనే అవకాశం మనకే ఇచ్చాడు .

మహాభారతంలోనూ కర్ణుడు రారాజు దుర్యోధనోడితో చేసిన స్నేహం … దుర్యోధనుడి వెంట మరణం వరకు ఉన్న కర్ణుడు…స్నేహం కోసం ధర్మాన్ని సైతం ఎదరించి యుద్ధం లో ప్రాణాలను వదిలాడు. ఇంకొకటి కృష్ణ కుచేల స్నేహ బంధం . ఇక తెలుగు నేలపై పరిటాల రవి , చమన్ ల స్నేహబంధం , తమని నమ్మిన ప్రజల కోసం పనిచేసిన తీరు కాల పరీక్షలో నిలిచి గెలిచింది .

ఇక మనుషులతోనే కాకుండా ప్రకృతి లో వున్న జీవరాసుల తో స్నేహం చేసే వారిని కూడా మనం చూస్తున్నాం . కుక్కలతో స్నేహం సర్వ సాధారణం ిన విషయం తెలిసిందే కదా .. మీరు కూడా అంతర్జాతీయ స్నేహితుల దినం 6 ఆగష్టు 2023 రోజున , మీ మీ స్నేహితులతో ఆనందం గా గడుపుతారని ఆశిస్తూ … #editorksr

శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే – వివేకానందుడు

అహంకారికి మిత్రులు ఉండరు .. ఆస్కార్ వైల్డ్

చేదు స్నేహితుల కన్నా , మిత్రులు లేకుండా ఉండడం మంచిది .. మార్టిన్ లూథర్ కింగ్ .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments