Friday, October 25, 2024
spot_img
HomeElections 2023-2024ఆ నలుగురికి ఇక నరకమే

ఆ నలుగురికి ఇక నరకమే

ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ రోజు ఒక క్రమ పద్దతిలో తనపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ కుటుంబంపై మరోసారి విరుచుకు పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే కనీసం 30 సీట్లు కూడా గెలిచే వారు కాదు అంటూ ఎక్స్ మినిష్టర్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంకో వైపు కేటీర్ పాల్గొనే ప్రతి ప్రోగ్రాంలోనూ ఎక్స్ మినిష్టర్ హరీశ్ రావు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మతాల తూటాలని సంధిస్తున్నారు. ఈ సందర్బములో .. తాజాగా సెక్రెటరియేట్ లో సింగరేణి లో పని చేసే కార్మికులకు రూ.కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఈ శుభ సందర్భంగా మీడియాతో మిత్రులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబంపై విమర్శనాస్త్రాలని సంధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురి ఘోష మాత్రమే వినిపిస్తుంది అంటూ ఎద్దేవా చేసారు సీఎం రేవంత్ . వివాదాలు విద్వేషాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని నిలిపి వేశారు అన్నసీఎం రేవంత్ .. కోర్టు లో ఉన్న కేసుల్ని పరిష్కరించి నియామక పత్రాల్ని మేము అందిస్తున్న విషయాన్నిమరిచిపోవువాడు అని గుర్తు చేసారు .వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కెసిఆర్ కట్టిన ప్రాజెక్టులు కుంగిపోయి కూలిపోతున్నాయి అని అన్నారు సీఎం రేవంత్ .

Hell for those four

అన్నారం బ్యారేజి పగిలిపోయిన కారణంగా నీళ్లు వ్రథాగా పోతున్న, కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చెప్పండి అంటే కల్వకుంట్ల కుటుంబం నుంచి సమాధానం లేదు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల టీఎంసీలు తోడుకుంటుంటే బారాసా ప్రభుత్వం పట్టించుకోలేదని , పైగా ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విందు ఇచ్చి మరి ఒప్పందాలు చేసుకొని క్రిష్ణా జలాల్ని తాకట్టు పెట్టారని . తెలంగాణను బారాసా అధినేత గులాబీ దళపతి కేసీఆర్ దివాలా తీయించారని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి .
తెలంగాణ రాష్ట్రాన్ని ,రాష్ట్ర ప్రజల్ని రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని,నేడు ఆ అప్పులకై ప్రతి సంవత్సరం రూ.70వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. పదేళ్లలో శర వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన ముఖ్యమంత్రి భారత దేశంలోనే ఎవ్వరు లేరన్నారు . గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిని కల్పించారు కల్వకుంట్ల కుటుంబం .

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిజమైన నిరు పేదలకు అందాలన్న ఉద్దేశంతోనే రేషన్ కార్డులకు కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి .కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేసి,కొత్త లబ్థిదారుల్ని చేరుస్తామన్నారు సీఎం , ఏ విదమైనటువంటి నియం నిబంధనలు లేకుండా పథకాల్ని ఇచ్చేస్తే కోట్లున్నోడు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా వర్షాలు బాగా పడటంతో భూగర్భ జలాలు పెరిగాయి ,అందువలన రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరిగిందన్నారు సీఎం .ఈ వర్ష ప్రభావ కారణముగా వరి ఉత్పత్తి బాగా పెరిగింది అన్నారు సీఎం .. ఇదేమీ కేసీఆర్ గొప్పతనం కాదు , ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు అందువలన ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గిపోయాయి,మరి ఇప్పుడు భూగర్భ జలాల్ని గులాబీ బాస్ కేసీఆర్ పెంచుతాడా అంటూ రేవంత్ చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇపుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి .సీఎం రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కల్వకుంట్ల కుటుంబంలో ఆ న్బలుగురికి నరకం కనపడుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments