Saturday, December 21, 2024
spot_img
HomeNewsగద్వాల కోట లో భారాసా కు ఎదురు దెబ్బ ...!?

గద్వాల కోట లో భారాసా కు ఎదురు దెబ్బ …!?

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధి లోని 14 స్థానాల్లో ఒకటి . ఇది నాగర్ కర్నూల్(R ) లోకసభ స్థానం పరిధి లోనిది . గద్వాల నుంచీ గత 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 28 వేళా కు పైగా మెజారిటీ సాధించి డీకె అరుణ పై గెలిచారు . ఇక్కడ DK అరుణ కుటుంబానికి చెందిన వారు 9 పర్యాయాలు MLA గా గెలవడం జరిగింది . 2004, 2009, 2014 లలో DK అరుణ వరుస విజయాలు సాధించారు .

2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఈ స్థానం లో కాంగ్రెస్ 20 శాతం ఓట్లు మాత్రమే సాధించింది . ఐతే తదనంతరం జరిగిన అనేక పరిణామాలు డీకె అరుణ కు ఇబ్బందికరం గా మారాయనే చెప్పాలి . మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడు గా వున్న రేవంత్ రెడ్డి కి సొంత జిల్లా . ఈ జిల్లా నుంచే స్వర్గీయ జైపాల్ రెడ్డి తన రాజకీయ చక్రం తిప్పేవారు . అయితే గద్వాల్ అసెంబ్లీ స్థానం లో డీకే అరుణ కాంగ్రెస్ ను వీడి భాజాపా లోకి వెళ్లి , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా వున్నారు . కాంగ్రెస్ గత కొంత కాలం గా ఈ స్థానం లో సరైన నాయకుడి కోసం ప్రయత్నాలు చేస్తోంది .

తెరాసా భారాస గా మారింది . ఇక రాష్ట్ర రాజకీయాల్లో పాల పొంగు లా బండి సంజయ్ నేతృత్వంలో రెండు ఉప ఎన్నికల్లో గెలిచి కెసిఆర్ నాయకత్వానికి సవాల్ విసిరింది . అనూహ్యం గా కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తదుపరి భాజాపా దూకుడు కొంత తగ్గింది . ఇక కేంద్ర భాజాపా తెలంగాణా వ్యాప్తం గా అభిమాన గణం తో భాజపా బలాన్ని రెట్టింపు చేసిన బండి సంజయ్ ను మార్చడం తో తెలంగాణా భాజాపా శ్రేణుల్లో ఒకింత నైరాశ్యం వచ్చినట్లయుంది .

ఇదే సమయం లో భారాసా లో ఉక్కపోత కు గురౌతున్న ఖమ్మం నేత పొంగులేటి తో కలసి పాలమూరు జిల్లా కు చెందిన మాజీ మంత్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జూపల్లి కృష్ణారావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు . కాంగ్రెస్ ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొవడం తెలిసిందే …

ఈ నెల  30న కొల్లాపూర్ లో జరిగే ప్రియాంక గాంధీ సమక్షం లో జరిగే భారీ బహిరంగ సభలో   జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరటం లాంఛనమే . ఇక డీకే అరుణ రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఆమె తీసుకొనే నిర్ణయాలను బట్టి ఉంటుంది .

గత కొంత కాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య భేదాపిప్రాయాలు వున్నాయి . సరిత దంపతులు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకొని , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో చర్చలు జరిపారు . జూపల్లి ఆహ్వానం తో కాంగ్రెస్ లో చేరేందుకు  సరిత  దంపతులు అంగీకరించారు.  దీంతో  రేపు  సరిత దంపతులు  కాంగ్రెస్ లో  చేరిక నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం లో జరిగిందని తెలుస్తోంది .   వీరి చేరికతో గద్వాల్ ప్రాంతం లో కాంగ్రెస్ బలోపేతం కావడానికి , రాబోయే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఉపయోగపడుతందనంలో ఎలాంటి సందేహం లేదు . ఈ పరిణామాలతో గద్వాల్ కోట పై రాబోయే ఎన్నికల్లో మువ్వన్నెల జెండా తిరిగి ఎగరడం ఖాయమనే చెప్పాలి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments