గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ వరకు కారుని ఖాళీ చేసి బయటకు జంప్ ..
ఊహకు అందని అనూహ్యపరిణామాలతో గులాబీ పార్టీకి షాకులమీద షాకులు
మొన్న ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెసులోకి నేడు మరికొంతమంది సిట్టింగులు పార్టీ మారేందుకు సిద్ధం
ఒకొక్కరుగా brs ని వీడి కారుని ఖాళీ చేస్తున్న గులాబీ నేతలు
ఆల్రెడీ ఖమ్మంలో దాదాపుగా కారు పార్టీ కాళీ
BRS కు తీగల గుడ్బై రాజీనామా చేసిన కృష్ణారెడ్డి అనిత రెడ్డి తీవ్ర అవమానాలకు గురి అయ్యాను అని రేపు ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్స్ తీర్ధం
బీఆర్ఎస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు అని డిపాదాస్ ముంక్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి
గుర్తింపులేదని కొందరు BRS లీడర్ల ఆందోళన భవిష్యత్తు ఉండదనే భయంతో కారుని కాళీ చేస్తున్న నేతలు
లోక్సభ ఎన్నికల ముందు బారసాలో గందరగోళం వలసల నివారణలో
బారాసా అధినాయకత్వం ఫెయిల్
అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓడిపోయినా తరువాత బారాసా పరిస్థితి రాను రాను ప్రశ్నర్ధకం గ మారుతుంది . BRS పార్టీ లీడర్లు లోను ,కేడర్ లోనూ రాజకీయ భవిష్యత్తుపై రోజు రోజుకి భయం పెరుగుతుంది . బారాసా నుంచి ఒక్కొక్కరుగా గల్లీ లీడర్లు ,సిట్టింగులు, మాజీలు పార్టీ ఫిరాయిస్తున్నారు . గులాబీ దళపతి ,కారు పార్టీ నాయకత్వం సరిగా పట్టించుకోవడంలేదనే అసంతృప్తిని తెలియచేస్తున్నారు . ఈపాటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కారు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు మరికొందరు నేతలు అదే దారినిఎన్నుకున్నారు .
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి జై కొడుతూ కాంగ్రెస్లో కి చేరేందుకు పలువురు సిట్టింగ్ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం . లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైం లో జరుగుతున్న ఇలాంటి పరిణామాలతో బీఆర్ఎస్
అధిష్టానం గులాబీ బాస్ కెసిఆర్ ఆందోళనలోపడ్డారు . ఎలక్షన్ నగర మోగే నాటికీ ఇంకెంత మంది బారాసా ని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య ఇంకా పెరగొచ్చనే అనుమానాలు గులాబీ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలవడం, అదే సమయంలో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతుండటం గులాబీ నేతల్లో మరింత గుబులు పెంచింది అనే చెప్పాలి . ఏ టైమ్ లో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన లో గులాబీ పార్టీ అధిష్టానం వుంది .
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవక పోవడంతో కనీసం లోక్ సభ ఎన్నికల్లో
అయినా గెలుద్దాము అని భావిస్తున్న కారు పార్టీకి ,గులాబీ దళపతికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
గులాబీ పార్టీ వీడి కాంగ్రెసులోకి చేరడానికి చాలా మంది రెడీ ఉన్నారనే ప్రచారం బారాసా నాయకత్వాన్ని ఉక్కిరిబి క్కిరి చేస్తుంది . చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు ,సిట్టింగులు మొదలు మాజీలు, సైతం పార్టీకి దూరమవుతున్నారు. పార్టీ ఫిరాయిపులను నివారించడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ఫెయిల్ అయ్యారనేది పార్టీలో కామన్గ వినపడుతుంది ,
పార్లమెంట్ ఎన్ని కలకు ముందు నేతలు జారిపోవడం పారీ బలహీనపడడానికి దారితీస్తుందనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతు న్నది. కెసిఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగడం అనివార్యంగా మారిందని, నష్ట నివారణ బాధ్యత ఆయనపైనే ఉన్నదని ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు . కొంతమంది బారాసా లీడర్లు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగముగా రేవంత్ నాయకత్వానికి జై కొడుతున్నారు . దీన్ని చక్క దిద్దకుంటే బారాసాకు జరిగే నష్టం ఊహకు అందని రీతిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .