అయోధ్య రాముడి జననం పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల తూటాలా యుద్ధం జరుగుతోంది . అయోధ్య రాముడి పై కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని బండి స్పష్టం చేయగా.. తాజాగా ఈ అంశం పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని ,కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజల అభివృద్ధికి ఎంపీగా మీరు ఏం చేసారో చెప్పి యాత్ర మొదలు పెట్టాలని పొన్నం ప్రబాకర్ అన్నట్లు తెలిపారు.మాతృమూర్తి ఎవరికైన మాతృమూర్తే అని ,కానీ నేను ఏనాడూ రాముడి జనననమ్ పై మాట్లాడ లేదు అని . నేను అనని మాటను నాకు అంటకడుతూ తల్లి జన్మపై బండి సంజయ్ మాట్లాడటం దుర్మార్గం. తల్లి ఎవరికైనా తల్లే అటువంటి మాటలు మాట్లాడటం తప్పు.. నేను మా కాంగ్రెస్స్ పార్టీ శ్రేణులు ఎవరు బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకోవడం లేదు.
బండిసంజయ్ మాటలను మీరు ఏకీభవిస్తున్నారా అని నేను బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడుగుతున్నా ?కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి బండి సంజయ్ ఏమి చేసాడు బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఓడిపోతాను అనే భయంతోనే బండి సంజయ్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. హిందూ గాళ్ళు బొందుగాళ్ళు అని గులాబీ బాస్ కేసీఆర్ అన్న మాటలను ఎలా రాజకీయంగా నువ్వు వాడుకున్నావో , ఇప్పుడు అమ్మ గురించి నువ్వు మాట్లాడిన మాటల్తో నీ రాజకీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోవడం ఖాయం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటుంటే మీకేమి అయ్యింది .ఎప్పుడు కూడా ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా పల్లెత్తు మాట అనలేదు .
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసురుతున్న.. నేను నా రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటా, నువ్వు నీ వాదనతో నీ అభ్యర్థిని నిలబెట్టు. నేను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నా వ్యాపారం చేసుకుని జీవిస్తా , జీవితంలో రాముడని, హిందూ మతమని ఎక్కడ మాట్లాడను. నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అన్న బండి సంజయ్ మాటలకూ పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ,కరీం నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడు ,ఈ ఎలక్షన్స్ లో డిపాజిట్ దక్కకుండా బండిని బొంద పెడతా, రాజకీయ సన్యాసం తీసుకోవటానికి సిద్ధముగా ఉండు బండి అని పొన్నం ప్రభాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు .