Tuesday, December 3, 2024
spot_img
HomeNewsInternationalఎవరా నలుగురు వ్యోమగాములు ?

ఎవరా నలుగురు వ్యోమగాములు ?

ఎవరా నలుగురు వ్యోమగాములు ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రాజెక్ట్ గురించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి నుంచిముఖ్యమైన విషయాలు ఒక్కొక్కటి ట్విట్టర్ వేదికగా చెపుతూనే వస్తుంది . కానీ గగన్ యాన్ లో భాగమయ్యే ఆ నలుగురు వ్యోమగాములు ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే ఉంచింది ఇస్రో . చివరికి ఇన్ని సంవత్చరాల తర్వాత ఈ సస్పెన్స్ కు తెరదించుతూ.. నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించేసింది ఇస్రో . తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్స్ , వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అజిత్ కృష్ణన్,ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, గగన్‌యాన్ మిషన్‌లో భాగం అవుతున్నారు అని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేనితో అసలు ఈ నలుగురు ఎవరు? వాళ్ల చరిత్ర

Who are the four astronauts?

వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా, 1985 అక్టోబర్ 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో శుభాంశు జన్మించారు. ఎన్డీఏ పాత విద్యార్థి అయిన వారు IAF ఫైటర్ స్ట్రీమ్‌లో 2006 జూన్ 17వ తేదీన నియమితులయ్యారు . ఫైటర్ కంబాట్ లీడర్ అయిన శుభాంశుకు ,టెస్ట్ పైలట్‌గా సుమారు 2000 గంటల అనుభవం ఉంది. MiG-29,Su-30 MKI ,MiG-21, హాక్,జాగ్వార్, An-32 ,డోర్నియర్ , వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఫ్లై చేశారు.
గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ వీరు 1982 జులై 17వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఎన్డీఏ పాత విద్యార్థి అయిన వీరు .. 2004 డిసెంబర్ 18వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన అంగద్‌ ప్రతాప్ , టెస్ట్ పైలట్‌గా దాదాపు 2000 గంటలు నడిపిన అనుభవం ఉంది. ఆయన MiG-29,Su-30 MKI ,MiG-21, హాక్,జాగ్వార్, An-32 ,డోర్నియర్,వంటి వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఫ్లై చేసారు .

గ్రూప్ కెప్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వీరు 1967 ఆగస్టు 26వ తేదీన కేరళ రాష్ట్రంలో లోని తిరువాజియాడ్‌లో జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సోర్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్న వీరు 1998 డిసెంబర్ 19వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. క్యాట్-ఏ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన వీరికి , టెస్ట్ పైలట్‌గా 3000 గంటలు నడిపిన అనుభవం ఉంది. MiG-29,Su-30 MKI ,MiG-21, హాక్, An-32,డోర్నియర్, వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఫ్లై చేసారు .
గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ వీరు 1982 ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సిటీ లో జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్, సోర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. వెల్లింగ్‌టన్‌లోని డీఎస్ఎస్‌సీ పాత విద్యార్థి అయిన వీరు 2003 జూన్ 21వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన వీరికి టెస్ట్ పైలట్‌గా దాదాపు 2900 గంటలు నడిపిన అనుభవం ఉంది. MiG-29,Su-30 MKI ,హాక్,జాగ్వార్, An-32 ,డోర్నియర్,వంటి వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఫ్లై చేసారు .
గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ ,గ్రూప్ కెప్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్,గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ ,వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా, ఈ నలుగురు మన భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ లో భాగం అయ్యే వ్యోమగాములు . ఆల్ ది బెస్ట్ ఇస్రో ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments