గులాబీ పార్టీకి భారీ షాక్
రేవంత్ ను కలిసిన కేటీఆర్ విధేయుడు పరమ భక్తుడు బొంతు
మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత ఆప్తుడిగా .. ఆయనకు వీర విదేయుడు గా పేరున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
అజాత శత్రువులు అజాత మిత్రులు లేని రంగం ఏదైనా ఉందంటే ,అది ఉన్న ఏకైక రంగం రాజకీయ రంగమే అని చెప్పాలి .
నిన్నమొన్నటి వరకు తన రాజకీ ప్రత్యర్థులను అమ్మనాబూతులు తిట్టి .. తర్వాత రోజున ఏమి ఎరగనట్టు వారి భుజాన ,బండబూతులు తిట్టేసిన పార్టీ కండువాని ,తిట్టిన వారిచేతనే కప్పుకునే రోజులు నేటి రోజులు .
అలాంటి ఈ తరుణంలో , ఎవరెప్పుడు పార్టీలు మారతారో ఊహకందని పచ్చి నిజం. చేతిలో అధికారం ఉంటె ఎంతటివాడైనా పార్టీ మారేందుకు అస్సలు వెనుకా ముందు ఆడరు నేటి రాజకీయ నాయకులు .
ఈ రోజు అలాంటి తీరునే ప్రదర్శించి బీఆర్ఎస్ కు షాకిచ్చారు హైదరాబాద్ మహానగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.
మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత ఆప్తుడిగా , ఆయనకు వీరవిధేయుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
త్వరలో గులాబీ ని వదిలి ,కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అని తెలిసింది . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యములో కాంగ్రెస్ సునామి విజయడంకా మోగించింది,గ్రేటర్ పరిధిలో పార్టీలోకి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వనిస్తున్నట్లు తెలుస్తుంది .
హైదరాబాద్ మహానగరంలో మరింత పట్టు పెంచుకోవటానికి ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసారు కాంగ్రెస్ పెద్దలు . ఒకరోజు ముందే మాజీ డిప్యుటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కాంగ్రెస్ లో చేరటం అందరికి తెలిసిందే.
తాజాగా కేటీఆర్ పరమ భక్తుడిగా పేరున్న బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవటం రాజకీయముగా సంచలనంగా మారింది అనే చెప్పాలి .
బొంతు రాంమోహన్ లాంటి వారే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తుంటే,రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహానగరానికి సంబంధించి బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు,కార్పొరేటర్లు,కౌన్సిలర్లు , పార్టీ మారటం ఖాయం అని తెలుస్తుంది .
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కారు పార్టీని కాలుతో తన్ని .. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది.
2023 ఎన్నికల్లో సొంత పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బొంతు రాంమోహన్ కు నిరాశ ఎదురుకావడంతో తీవ్ర అసంత్రప్తితో ఉన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పదవి రాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన బొంతు రాంమోహన్, ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ని గౌరప్రదముగా కలిశారు.
ఒక మంచి రోజు చూసుకొని కారుని కాలుతో తన్ని కాంగ్రెస్ పార్టీలోకి కాలు పెట్టేయటం ఖాయమన్న మాటలు గ్రేటర్ పరిధిలో చక్కర్లు కొడుతున్నాయి . అన్ని తెలిసి షరా మాములే అని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్న కేటీఆర్, పార్టీ ఫిరాయిస్తున్న జంప్ జిలానీలను బుజ్జగిస్తున్నట్లు సమాచారం .
మొత్తానికి ట్విన్సిటీస్ ని టార్గెట్ చేసుకొని జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు ఎంపీ ఎన్నికలకు ముందే పూర్తి అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో జంట నగరాల్లో రాజకీయ రంగం లో ఎన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే .