Sunday, December 22, 2024
spot_img
HomeNewsఆపరేషన్ W

ఆపరేషన్ W

ఆపరేషన్ W

వాటర్ వార్‌ – అసెంబ్లీ సాక్షిగా ఇక సమరమే

తేల్చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఉభయ తెలుగు రాష్ట్రాల కృష్ణ జలాల వినియోగం గత ప్రభుత్వ పుణ్యమా అని తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని ,
కృష్ణా జలాల వినియోగంలో, వాటాలో, హక్కుల్లో భాగముగా తెలంగాణకు తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయంపై సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా పూస గుచ్చినట్లు వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .
అసెంబ్లీ సభా సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలందరికీ నిజ నిజాలు తెలిసేలా డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ,ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధముగా రావాల్సిన నీటి విషయంలోనూ గత BRS ప్రభుతం రాజి పడింది అని , ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ అనుమతి ఇచ్చారని లెక్కలతో సహా చట్ట సభలో వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్న కొన్ని ప్రధానమైన వ్యాఖ్యలు చూద్దాం
నీళ్ళ కోసం జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం,ఆ స్ఫూర్తికి విరుద్ధముగా గడచిన పదేళ్లలో అదే నీటి విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అని న్యాయమైన వాటాను సైతం గత తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేకపోయింది అని ఉత్తమ్ అన్నారు .
బారాసా ప్రభుత్వం ఉన్నపదేళ్ల కాలంలో షుమారుగా 1200 టీఎంసీల నీరు శ్రీశైలం బేసిన్ వెలుపలకు వెళ్లింది. దాదాపు 50 శాతం నీటిని రూల్స్కు విరుద్ధముగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వాడుకుంది . ఇది ఆంధ్రప్రదేశ్ కు దక్కిన కోటాకు కన్నా అదనం. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు గత ప్రభుత్వ పాలకులు చూస్తూ ఉన్నారు .
ఈ మొత్తానికి ప్రధాన కారణం కేసీఆర్ ప్రభుత్వమే. బేసిన్‌లో వాటర్ ఇన్ ఫ్లో తగ్గినా ఆంధ్రప్రదెశ్కి మాత్రం డైవర్షన్ పెరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులరేటరీ కెపాసిటీ 44000 క్యూసెక్కుల నుంచి 92,500 క్యూసెక్కులకు ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నది.
గులాబీ దళపతి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ఆపలేకపోయింది . రోజుకు 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి నీటిని డ్రా చేసుకున్నది ఏపీ .
హెల్సింకీ రూల్స్ ప్రకారం పరివాహక ప్రాంతం నిష్పత్తికి అనుగుణంగా తెలంగాణకు 68% ఉండాలి.
తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటాల్లో తీవ్ర అన్యాయం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం లోనే. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సుమారు 225.24 టీఎంసీలను వాడుకునే అవకాశం మన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నా డిమాండ్ చేసి సాధించుకోలేకపోయింది BRS నాయకత్వం . గడచిన పదేళ్లలో వాడుకున్న నీటి విలువ షుమారుగా ఏటా 59.54 టీఎంసీలు మాత్రమే.
తెలంగాణ వాటాగా అడ్‌హక్‌గా కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 299 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నా కేవలం 197.83 టీఎంసీల చొప్పున మాత్రమే గడచిన పదేండ్లలో ఏటా వాడుకోగలిగాం.
మొత్తం 525 టీఎంసీలు అడగాల్సింది. కానీ కేవలం 299 టీఎంసీలకు మాత్రమే ఏపీతో ఒప్పందాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్నది.
ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల లెక్కలను కేంద్ర ప్రభుత్వ సమావేశాల్లో వివరించలేకపోయింది గత భారాసా ప్రభుత్వం .
తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా నీటి హక్కులు రాకుండా అన్యాయానికి పాల్పడింది BRS ప్రభుత్వం కాదా . బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేకూర్చేలా కృష్ణా జలాల ఒప్పందాల్లో మరణ శాసనం రాసింది అని మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రముగా విమర్శించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments