తెలంగాణ భాజపా శ్రేణులు ప్రజా సమస్యలపై పోరాటాలకు నడుం బిగించి , నయా అధినేత కిషన్ రెడ్డి నేతృత్వాన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ను లబ్ది దారులకు కేటాయుంచాలని కోరుతూ మహాధర్నా కు పిలుపునిచ్చారు . కిషన్ రెడ్డి తన పదవి ప్రమాణ స్వీకారం ముందు రోజు డబల్తి బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనార్దం వెళ్లగా వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు .
దీనిపై భాజాపా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చింది . ఇక అగ్రనేతలు ఇందిరా పార్క్ వద్ద తలా పెట్టిన మహాధర్నా కు పోలీసులు అనుమతి నిరాకరించారు . ఆదివారం నాడు భాజాపా హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో ముఖ్య నేతలతో సమావేశం జరిగింది . ఈ సమావేశం లో కిషన్రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ ఆగడాలను నివారించి హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాలను బీజేపీ కాషాయ జెండా ఎగురవేయాలని దీనికై అందరూ కలిసి పనిచేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
ఇక మంగళవారం తలపెట్టిన మహాధర్నా కు పోలీసు అనుమతులు రాని కారణంగా భాజాపా నేతలు ఏం చేస్తారో తెలియాల్సి వుంది .
UPDATE: breaking news: Highcourt grants permission for TBJP maha dharna at Indira Park