కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఒంటెద్దు పొకడలతో పార్టీలో ఆధిపత్యం చెలాయించే వారిని ముందుగానే పసిగట్టి వారికి చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితి, నాయకుల మధ్య సమన్వయం, కలహాలు, అంతర్గత విబేధాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతల మధ్య సమన్వయం కుదరుతుండటంతో జిల్లాల్లోని పరిస్థితులపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
వరంగల్ జిల్లా పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన రేవంత్ త్వరలోనే ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం.
వర్గ రాజకీయాలకు చెక్ పెట్టనున్న రేవంత్ రెడ్డి..! Revanth Reddy will check communal politics | Kai tv