[ad_1]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’ చిత్రం ప్రేమకథల్లో దృశ్యకావ్యంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాని చూసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం ఈ సినిమాని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. “ఈ చిత్రంలో దుల్కర్‌ని చూడటం చాలా రిఫ్రెష్‌గా అనిపించింది. అది అతని నిజాయతీ నుంచి వచ్చింది. ఇక మృణాల్ గురించి ఏమని చెప్పాలి. చాలా నిజాయతీగా నటించింది. త్వరలో ఆమె పెద్ద స్టార్ అవుతుంది” అని అన్నారు.
[ad_2]