[ad_1]
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ హీరో ధనుష్‌తో ’సార్’ చిత్రాన్ని సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ’సార్’కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ’సార్’(తెలుగు), ‘వాతి’(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
[ad_2]