Saturday, September 14, 2024
spot_img
HomeCinemaయాక్షన్, డ్రామా కలగలిసిన ‘ది ఘోస్ట్’

యాక్షన్, డ్రామా కలగలిసిన ‘ది ఘోస్ట్’

[ad_1]

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్‌ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కర్నూలులో ‘ది ఘోస్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. “ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. విజయదశమి అందరికీ విజయాన్నిస్తుందని అంటారు. ఈ పండగ మాకు కూడా విజయాన్నిస్తుందని నమ్ముతున్నా. మీ అందరికీ నచ్చి ఈ సినిమాను మెచ్చుతారని అనుకుంటున్నాను.‘ది ఘోస్ట్’ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి యాక్షన్, డ్రామా అంటే ఇష్టం. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమా తీశారు. శివ సమయంలో సౌండ్స్ గురించి మాట్లాడారు.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments