Saturday, September 21, 2024
spot_img
HomeCinemaబాలయ్యకు జోడీగా నయన్?

బాలయ్యకు జోడీగా నయన్?

[ad_1]

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కథానాయిక ఎవరన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం నయనతారకు దక్కినట్టు సమాచారం. త్వరలోనే ఈ కాంబోపై ఓ అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాకే అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. గతంలో నందమూరి బాలకృష్ణ, నయనతార కలిసి శ్రీరామరాజ్యం, సింహా, జైసింహా సినిమాలు చేశారు. ఈ మూడు చిత్రాలలోనూ వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట వెండితెరపై సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments