[ad_1]
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. నాగ్ సరసన సోనల్ చౌహన్ కథానాయికగా నటించింది. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా కొద్దిసేపటిక్రితం ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. సునీల్ నారంగ్ పూస్కూర్ రామ్మోహనరావ్, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్, భరత్ సౌరబ్ సంగీతం అందించారు.
[ad_2]