[ad_1]
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ కెప్టెన్ మిల్లర్. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టిజి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే యంగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్ లో చేరారు. తాజాగా ‘కెప్టెన్ మిల్లర్’ కథానాయికలు ఖరారయ్యారు. ఈ చిత్రంలో ధనుష్‌కి జోడిగా ఇద్దరు కథానాయికలు ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. “ఇంత భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, ధనుష్‌తో జోడీగా నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది. అరుణ్ మాథేశ్వరన్, సత్యజ్యోతి ఫిలమ్స్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎదురుచుస్తున్నా”అని ట్వీట్ చేశారు. “నా మనసుకు దగ్గరైన ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ని చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. గొప్ప స్ఫూర్తినిచ్చే ధనుష్‌తో నటించే అవకాశం రావడం నమ్మశక్యం కావడం లేదు” అని నివేదిత సతీష్ ట్వీట్ చేశారు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
[ad_2]