[ad_1]
మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఆయన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దియర్-2022’గా ఎంపికయ్యారు. ఆదివారం ఈ చలన చిత్రోత్సవాల్లో గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాబితాలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ముఖ్య అతిథులుగా నటించారు. ఈ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కడం విశేషం. చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా 150కి పైగా సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ఇక, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఆదివారం ప్రారంభమైన ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈనెల 28 వరకు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలో 79 దేశాల నుంచి మొత్తం 280 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ 25 ఫీచర్ సినిమాలు, 20 నాన్-ఫీచర్ సినిమాలను కూడా ప్రదర్శించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’గా ఎంపికకావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవికి భారతీయ చలనచిత్ర వ్యక్తిత్వం ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది
[ad_2]