[ad_1]
హైదరాబాద్:ఈ మూవీలో రాముడిగా ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అయితే.. చాలాకాలంగా ఈ మూవీ 2023 సంక్రాంతికి విడుదల అవుతుందన్న సమచారం తప్ప.. ఎటువంటి అప్‌డేట్ లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎదైనా అప్‌డేట్ ఇవ్వమంటూ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని కోరారు. తాజాగా ఈ మూవీ నుంచి రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ()ని విడుదల చేసింది మూవీ టీం. అంతేకాకుండా.. మూవీ పోస్టర్‌ని, టీజర్ అక్టోబర్ 2న విడుదల చేస్తామని తెలిపింది.ఈ ప్రభాస్ పోస్టర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షల లైకులు సాధించింది. కాగా.. మరోవైపు ఈ పోస్టర్ చాలామందికి నచ్చలేదు. దాంతో సోషల్ మీడియా వేదికగా మూవీ టీంని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘ఫ్యాన్స్ తయారు చేసిన పోస్టర్లు.. దీనికంటే బావున్నాయి’ అని ఓ నెటిజన్.. ‘మంచి ఫేస్ కట్‌తో మంచి పోస్టర్‌ని వస్తుందని అనుకున్నాం. కానీ యావరేజ్‌గా ఉంది. అభిమానులకు నచ్చొచ్చు. కానీ ఇతరులకు నచ్చే అవకాశం లేదు’ అని ఇంకొకరు.. ‘ప్రభాస్ లుక్ మొదటి నుంచి కొంచె డిఫరెంట్‌గా ఉంది. కానీ వీఎఫ్‌ఎక్స్‌తో సరి చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు’.. ‘మీకన్నా అభిమానులే బెటర్.. మంచి పోస్టర్లని క్రియేట్ చేశారు’ అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు.
[ad_2]