[ad_1]
బెల్లంకొండ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[ad_2]