[ad_1]
కోల్‌కతా: బెంగాలీ నటి ఐండ్రిల్లా శర్మ బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. వారం రోజుల పాటు ఆమె తీవ్రస్థాయి అనారోగ్యంతో బాధపడి కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకు ముందు ఆమెకు రెండుసార్లు క్యాన్సర్ వచ్చింది. నయం అయిన తరువాత తేరుకుని తిరిగి 2015లో సినిమాలలో నటించింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఈ నటి బెంగాలీ టీవీ సీరియల్స్‌లో నటించి విశేష గుర్తింపు పొందారు. జియాన్ కథి, ఝుమూర్, జిబన్ జ్యోతి వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు.
ఎవింగ్స్ సర్కోమా అనే తీవ్రస్థాయి అరుదైన క్యాన్సర్‌తో ఆమె బాధపడ్డారు. ఇది ఎముకలలో, కణజాలంలో ఏర్పడుతుంది. సర్జరీ, కెమోరేడియేషన్తో కొంత మేరకు కోలుకున్నారు. అయితే ఈ నెల 1న ఆమె బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హౌరాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తీవ్రస్థాయి రక్తస్రావం అయింది. పలు రకాలుగా నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స జరిపినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు సంతాపం వ్యక్తం చేశారు.
బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు
[ad_2]