Wednesday, January 29, 2025
spot_img
HomeElections 2023-2024బీజేపీలోకి హరీష్ రావు బిఆర్ఎస్ "చాప్టర్ క్లోజ్"..

బీజేపీలోకి హరీష్ రావు బిఆర్ఎస్ “చాప్టర్ క్లోజ్”..

కెసిఆర్ జైలుకు.!? BRS Chapter Close ? Harishrao Will Join BJP ? | KCRబిఆర్ఎస్ “చాప్టర్ క్లోజ్”..
బీజేపీలోకి హరీష్ రావు..? కెసిఆర్ జైలుకు..!?

తెలంగాణాలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయ్. ఇదే క్రమంలో గత ఎన్నికల నాటి నుండి కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే అంటూ బీఆర్ఎస్ నేతలు తరచూ చేస్తున్న ఆరోపణ ఇది. ఇందుకు బలం చేకూర్చేలానే బీజేపీ నేతల వైఖరి కూడా ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ నేతలు బీఆర్ఎస్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సైతం కాంగ్రెస్‌, బీజేపీ విమర్శించుకోకూడదని.. ఇద్దరం కలిసి బీఆర్ఎస్‌ను బొందపెట్టాలంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిస్థితుల్లో బిఆర్ఎస్ లో హరీష్ రావు కి ఆదరణ తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో వస్తే ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు పార్టీ నుంచి బయటికి వస్తే ఆయనను బిజెపిలోకి చేర్చుకుంటామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బిజెపి సిద్ధాంతాలు నమ్మి ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా సరే బిజెపిలో చేరవచ్చు అని బండి సంజయ్ ఆహ్వానించారు. శుక్రవారం మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ. కెసిఆర్ అహంకారంతోనే కేటీఆర్ బలుపుతో బిఆర్ఎస్ కథ కంచికి చేరిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉందని అందుకే బిఆర్ఎస్ స్కామ్ లు ఇన్ని బయటపడుతున్నా కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వయిరీ కి డిమాండ్ చేసిందని అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఉంటే కేసిఆర్ కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని ఆ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments