Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradeshకాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగ ప్రవేశం .. షర్మిలమ్మ తో డీల్ ఓకే...

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగ ప్రవేశం .. షర్మిలమ్మ తో డీల్ ఓకే …!?

తెలంగాణ కాంగ్రెస్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు . ఏఐసీసీ నేతృత్వంలో తెలంగాణా కాంగ్రెస్ కు దిశా నిర్దేశం జరుగుతోంది . చిన్న నాయకులు mla , జిల్లా స్థాయి నాయకులు pcc అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వం లో గాంధీ భం వద్ద జాయిన్ అవుతుండగా , రాష్ట్ర స్థాయి నేతలు ఢిల్లీ నేతలే స్వయం గా రంగం లోకి దిగి , రాష్ట్ర నాయకత్వం తో మాట్లి చిక్కులను తొలగించి పార్టీ లో చేర్చుకొంటున్నారు . ఈ కోవలోనే గత కొంతకాలం గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గణనీయమైన అభిమాన గణము కలిగిన దివంగత నేత వైస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైస్ షర్మిలా రెడ్డి పార్టీని కాంగ్రెస్ లో విలీనం దాదాపు ఖరారు అయినట్లే .

వైస్సార్ సోనియా గాంధీ తో

అయితే ఒక్క తెలంగాణ లో మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వైస్ షర్మిళా రెడ్డి సేవలు వినియోగించుకునే విధం గా విధి విధానాలను రూపొందించారు . ఇప్పటికే ఢిల్లీ లో ఆమె కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు . తెలంగాణలో ఎన్నికల వేడికి ముందే వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‏లోకి విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకొంది . వీటి వ్యూహం వెనుక కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ షర్మిల, డీకే శివకుమార్‌ ఇప్పటికే రెండు మూడుసార్లు భేటీ అయ్యారు . కర్ణాటక లో ఇటీవల అధికారం లో వున్నా భాజాపా ను ఖంగు తినిపించడం లో DK పాత్ర ఎనలేనిది . రాబోయే లోకసభా ఎన్నికల్లో దక్షిణాది నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ సాధించాలనేది ఏఐసీసీ వ్యూహంగా వుంది. గత కొంత కాలం గా వైస్ షర్మిల పాదయాత్ర ద్వారా తెలంగాణ లో విస్తృతం గా తిరిగారు . ట్విట్టర్ వేదికా తీవ్ర వ్యాఖ్యలను ఆమె తెలంగాణ అధినేత కెసిఆర్ పై చేస్తూ వస్తున్నారు .

తాజాగా ఢిల్లీ నుంచి ఒకే విమానంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీతో కలసి రావడం, ఆమె పార్టీ విలీనం మరింత ముందుకెళ్లినట్టు తెలుస్తోంది. కేవీపీ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చింతా మోహన్ తదితరులు కూడా ఆమెను పార్టీ లోకి ఆహ్వానించడం తెలిసిందే . తెలంగాణలో కర్ణాటక తరహాలోనే గ్యారెంటీ హామీలు ఇవ్వడం, షర్మిల పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా మరింత బలోపేతం చేయ దలిచారు . అన్ని కోణాలలో తెలంగాణలో పాగా వేసేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అధిష్టానం రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ , ప్రాయంగా గాంధీ స్వయం గా తమ పర్యవేక్షణలో ఉభయ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ లకు మరో మరో స్టార్ కాంపైనర్ ను ఇట్చినట్లే ..ఆమె తెలంగాణా లో పోటీ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచార బాధ్యతలు తీసుకునే విధం గా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది . ఇప్పటికే రేవంత్ రెడ్డి తనదైన శైలి లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని ముందుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే …

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments