Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra PradeshMood of the Nation Survey August 2023 లో ఆంధ్ర లో సంచలనం ..

Mood of the Nation Survey August 2023 లో ఆంధ్ర లో సంచలనం ..

ఆంధ్రప్రదేశ్ లో తెదేపా దూకుడు మీద వుంది .. అధికార వైకాపా కు తెదేపా నాయకులు , కార్యకర్తలపై పోలీసుకేసులు మినహా ఏమీ చెయ్యలేని పరిస్థితి వుంది . ఇక తెదేపా శ్రేణులు అక్రమ కేసులకు భయపడేది లేదని దూకుడు గా వ్యవహరిస్తున్నారు . ఈ తరుణం లో బయటకు వస్తున్న సర్వేలు అధికార గణం గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధం గా వున్నాయి . అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం .

TIMES NOW : ఈ క్రమంలోనే టైమ్స్ నౌ ETG ఒక సర్వే ను విడుదల చేశాయి ..ఆ సర్వే లో వైకాపా కు ఆంధ్రప్రదేశ్ లో 24 లేదా 25 స్థానాలు వస్తాయని తెలియ చేసింది . ఈ సర్వే పూర్తిగా అసంబద్ధం గా ఉందని . ప్రేరేపిత సర్వే గా భావించవచ్చని , వైకాపా వర్గాలే చెబుతున్నాయి .

IPAC (Leaked ) : ఇక IPAC రిపోర్ట్ (leaked ) పేరుతొ ఒక సర్వే చక్కర్లు కొడుతోంది . ఈ సర్వే ప్రకారం అధికార వైకాపా కు 3 లోకసభా స్థానాలే వచ్చే అవకాశం ఉన్నట్లు వుంది . ఇక 16 స్థానాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే చెబుతోంది . మిగిలిన 6 ఎంపీ స్థానాల్లో పోటాపోటీ వాతావరణం లో , జనసేన తెదేపా కలిస్తే ఆ ఆరు స్థానాలు వైకాపా కోల్పోయే అవకాశం వుంది .

ఇక ఇండియా టుడే -c – voter తో కలిపి ఇటీవల చేసిన మూడ్ అఫ్ ది నేషన్ లో చేసిన కామెంట్స్ సంచలనం గా మారాయి . ఏపీలో అధికారవైకాపా పార్టీలో వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే NDAలో లేని టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.  గతం లో తెదేపా అధినేత చంద్రబాబు NDA-1 కి కన్వీనర్ గా వున్నా సంగతి తెలిసిందే .

సదరు జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులపై చేసిన సర్వే రిపోర్ట్స్‌ను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఉంచారు. ఈ రిపోర్టుల ప్రకారం గత ఏడాది కలం లో తెదేపా క్రమం గా పుంజుకుంటూ ఇప్పుడు ఆధిపత్య దిశగా ప్రయాణం చేస్తోదని తెలుస్తోంది . 2022లో ఇదే ఛానల్ తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్‌లో 7 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వస్తాయని , జనవరి 2023లో తెలుగుదేశం [పార్టీ 10 ఎంపీ సీట్లలో గెలిచే అవకాశాలున్నట్లు అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

ఈ సర్వేలు బయటపడటం తో తమ అంచనాలకు అనుగుణంగానే ఇవి ఉన్నాయని తెదేపా శ్రేణులు భావిస్తూ , ప్రచార జోరు పెంచారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments