Suspended YSRCP MLA Undavalli Sridevi met Chandrababu: బహిష్కృత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఉండవల్లి శ్రీదేవి తనను ఏపీలో అడుగుపెట్టకుండా భయభ్రాంతులకు గురి చేశారని తాడికొండ ఎ మండిపడ్డారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో సాగునీటి ప్రోజెక్టుల పర్యటనలో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. దాదాపు 20 నిమిషాల పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో డాక్టర్ దంపతులు సమావేశమయ్యారు. నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలో 12 వ తేదీన ప్రవేశించే వేళ తాడికొండ MLA ఉండవల్లి శ్రీదేవి తెదేపా అధినేతను కలవడం విశేషం .

చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే ధైర్యంతోనే రాష్ట్రానికి వచ్చి ఆయనను కలిసినట్లు తెలిపారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక వైసీపీ గూండాల బెదిరింపులకు గురై కష్టాల్లో ఉండి కన్నీరు పెట్టుకున్న సమయంలో.. వారి నుంచి తనకు రక్షణ కల్పించింది నారా లోకేష్ మరియు చంద్రబాబే అని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. ప్రస్తుతం మర్యాద పూర్వకంగానే చంద్రబాబుని కలిశానని.. అతి త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు. జగన్ చెప్పే నాడు-నేడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో వివరిస్తానన్నారు. ఒక విజనరీ ఉన్న లీడర్ని కలవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
వైసీపీ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గా కేవలం 4000 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు . అయితే ఇటీవలి ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు . తాడికొండ స్థానం 2024 లో తెదేపా ఖాతాలో వేసుకోవచ్చు . ఈ రాజధాని స్థానం లో ఎవరు అభ్యర్థి ఐనా మెజారిటీల్లో తేడా తప్పితే తెదేపా గెలుపు ఖాయమనే వివిధ సర్వేల ఆధారంగా తెలుస్తోంది .