Saturday, August 13, 2022
spot_img
HomeNewsAndhra Pradeshఅపాయింట్మెంట్ కి 50,000 వసూలు నిజమేనా ??

అపాయింట్మెంట్ కి 50,000 వసూలు నిజమేనా ??

మా ఎమ్మెల్యే .. మా ఎంపీ .. మా లీడర్ అని భజన చేసే కుహనా జనాలకి ఈ వార్త కాస్త కష్టంగానే ఉంటుంది … నిజమో అబద్దమో తెలియదు కానీ ఇప్పుడు ఇద్దరు మహిళా మంత్రుల గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతోంది .. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా జగన్ని అడిగేసింది ఏందయ్యా ఇది నిజమా అని !!

వివరాలు చూస్తే .. చిలకలూరిపేట ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడుదల రజిని, నగరి ఎమ్మెల్యే, క్రీడా పర్యాటక శాఖా మంత్రి రోజా రెడ్డి .. వీళ్ళిద్దరిపై ఇప్పుడు ఈ వసూళ్ల ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి .. పోనీ ప్రతిపక్షాల రాద్ధాంతం ఇది అనుకుందాం అంటే సొంత పార్టీలోనే వీళ్ళమీద చర్చలు జరుగుతున్నాయో !! ఎవరైనా మంత్రిణి గారిని కలవాలి అంటే కేవలం అపాయింట్మెంట్ మాత్రమే రూ. 50000 కట్టాలిట .. అపాయింట్మెంట్ కె ఇంత అయితే ఇక పని చేయించుకోడానికి పని పూర్తయ్యాక ఇంకెంత సమర్పించుకోవాలి అని సెటైర్లు గట్టిగా పేలుతున్నాయి ..

మంత్రిగారిని కలవాలంటే పూలు పళ్ళు మహా అయితే ఒక శాలువా దానితో పాటు ఒక వినతి పత్రం .. ఇదీ మనకి తెలిసిన అపాయింట్మెంట్ తీరు ..మనకి ఇన్నాళ్ళుగా తెలిసింది .. కానీ ఇదెక్కడి కొత్త సంస్కృతో అర్ధం కావట్లేదు .. అయితే ఇందులో అవాస్తవం కూడా లేకపోలేదు .. ఎందుకంటే .. ఆర్థికపరంగా చూస్తే ఇద్దరు మహిళా మంత్రులు బాగా ఆర్ధికపుష్టి ఉన్నవాళ్లే .. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రోజా రోజుకి 3 షిఫ్టులు పనిచేసి నిలదొక్కుకుని బాగానే సంపాదించుకుంది.. అంతేకాక ఇటీవల మంత్రి అయ్యేముందు వరకు కూడా జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు ఒక్కో ఎపిసోడ్ కి 2 లక్షలదాకా తీసుకునేది అని టాక్ .. ఇక విడదల రజిని .. చంద్రబాబు ఐటి తోటలో నాటిన మొక్క అని చెప్పుకుని దాదాపు 1200 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి ఓనర్ కూడాను … ఇవికాక ఇద్దరికీ జీతాలు అలవెన్సులు బాగానే వస్తాయి .. ఇంకా వీళ్ళకి ఈ అపాయింట్మెంట్ లకి చిల్లర వసూళ్లు చేసే ఆస్కారం ఉందంటారా ?

మొత్తానికి ఈ అపాయింట్మెంట్ వసూళ్లు ప్రస్తుతం అధికార వైసీపీ లో ..ప్రజల్లో కాక పుట్టిస్తున్నాయి .. ఇదంతా నిజమేనా అని జగన్మోహనుడే చెప్పాలి మరి .. మనలో మనమాట…. మంత్రులే 50000 తీసుకుంటే ముఖ్యమంత్రి ఎంత తీసుకోవాలంటారు ఒక అపాయింట్మెంట్ కి ? కామెంట్లు కొట్టండి మరి !!

RELATED ARTICLES

Most Popular

Recent Comments