Pulivendula: ‘పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయి’
శనివారం దివంగత నేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన షర్మిల… తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని తెలిపారు.
రెండు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన షర్మిల… సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల… చాలా విస్తృతంగా తమ చర్చలు జరిగినట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని కామెంట్స్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ విలీనంపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.
ఇక వైస్ షర్మిలా రెడ్డ్డి రాజకీయ కూడలి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా … మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియొ చూడగలరు .https://www.youtube.com/watch?v=b20g9rzc-qg