Chittur : ఈ మాటలు గతం లో జేసీ దివాకర్ రెడ్డి వైస్ జగన్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు … అవి నిజం అనేట్లు గా అనేక సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి . బాబాయి హత్య కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్ట్ లో బెయిల్ ఈ రోజు రాలేదు …పైగా సిబిఐ సుప్రీమ్ కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది . కాలం కలసి రావడం లేదు . డైవర్షన్ రాజకీయాలు ప్రజలు గమనిస్తూ , పట్టించుకోవడం మానేశారు . ఇక మిగిలింది ఎటాక్ … పగ .. పగ అంటూ రగిలి పోతున్నారు .
అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇలా హై కోర్ట్ తీర్పుల పై అనేక సార్లు సుప్రీం గడప తొక్కిన సంగతి తెలిసిందే ..
రాజకీయ కక్షల కోసం ప్రజాధనాన్ని జగన్ సర్కార్ ఎలా దుర్వినియోగం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. హత్యాయత్నం కేసులు పెట్టడానికి కనీస ఆధారాలు లేకపోయినా, వందల సంఖ్యలో పేర్లు పెట్టి.. కేసులు నమోదు చేసి.. జైలుకు పంపాలనుకున్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ప్రాధమిక ఆధారాలూ సమర్పించలేదు. అయినా సుప్రీంకోర్టుకు వెళ్లారని.. న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వ్యవస్థల్ని పూర్తిగా రాజకీయ కక్షలు.. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంలో రాటుదేలిపోయారు. ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితం కూడా లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలపై సుప్రీంకోర్టు నిజాలేంటో తెలుసుకుంటే.. ముందుగా పోలీసులే ఇరుక్కునే అవకాశం ఉందని న్యాయ నిపుణుల అభిప్రాయం .
ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడు , దేవినేని ఉమా , పులివర్తి నాని , నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంకా 323 మంది పై కేసు పెట్టిన సంగతి విదితమే ..