జూలై 30న ‘ఏమ్మా అంత తక్కువా..? ఎందుకలా? నా మీద నమ్మకం లేదా..!’ అంటూ ఓ మహిళతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ జరిపిన సంభాషణ వీడియో వైరల్ అయింది. తర్వాత ఆరు రోజులకే శోభారాణి సెల్ఫీ వీడియో వైరల్ అయింది.
ఆ సెల్ఫీ వీడియోలో శోభారాణి జిల్లా ఎస్పీని సంభోదిస్తూ. ..నా పేరు శోభ. గతంలో వన్‌టౌన్ ఏరియాలో ఉండేదాన్ని. లెక్చరర్‌గా పని పనిచేశాను. ఫ్యాషన్ డిజైనర్‌ని కూడా. రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశాను. ఎమ్మెల్యేతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. సంవత్సరం క్రితం వన్‌టౌన్ సీఐ వెంకట్రామయ్య ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు పెట్టారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను పంపుతున్నాను. హోం మినిస్టర్ గారికి అన్ని ఎవిడెన్సులనూ పంపించాను. అప్పట్లో ఎస్పీ ఫక్కీరప్ప నేను చూసుకుంటాను అని చెప్పారు. నాపై హత్యాయత్నం చేయించారు. దాడులు చేయించారు. రెండురోజుల క్రితం కూడా నాపై కేసు కట్టారు. నా వాట్సా్‌పకు ఎఫ్‌ఐఆర్ కాపీ పంపించారు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. బట్టలు లేకుండా(నగ్నంగా) ఏవేవో పూజలు చేయించారు. ….. లావాదేవీలు, చెక్కు బుక్కులు అన్ని మీకు వాట్సా్‌పలో పెట్టాను. నా హెల్త్ బాలేదు. కొవిడ్ బారినపడ్డాను. అయినా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. దీనంతటికి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, కర్నూలు వన్‌టౌన్ సీఐ కళావెంకటరమణ, యశ్వంత్, సీఎంఆర్, జయ, ఆఫక్, గురువు కారణం. ఎవిడెన్స్‌గా నా కాల్ హిస్టరీ తీసుకోండి’’ అని శోభారాణి ఆ వీడియో లో అభ్యర్థించారు.
(source : https://www.youtube.com/watch?v=9GU1d7horBU&t=66s)
ఈ వీడియో కొంత పాతది లా అగుపిస్తోంది , కాగా MLA hafizkhaanhttp://www.az7am.com ఈ వీడియో పై వివరణ ఇచ్చారు . తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక , ప్రత్యర్ధులు ఒక మహాలను అడ్డు పెట్టుకొని వీడియో వైరల్ చేశారన్నారు . అసత్య ప్రచారాలు సరైనవి కావు అన్నారు .