Andhrapradesh Assembly 2024: ఉమ్మడి కృష్ణా జిల్లా లో ముఖ్యమైన శాసన సభా నియోజకవర్గం గన్నవరం . గన్నవరం వద్దే ఎయిర్ పోర్ట్ ఉండడం తో దీనికి ప్రాముఖ్యత వుంది . సుమారు 260,000 ఓటర్లు వున్నా ఈ నియోజకవర్గానికి వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు . వీరు 2014, 2019 లలో వరుసగా 2 సార్లు తెదేపా అభ్యర్థి గా విజయం సాధించారు . అయితే 2019 ఎన్నకల అనంతరం అధినేత పై , ఆయన కుటుంబం పై తీవ్ర విమర్శలు చేస్తూ అధికార వైకాపా కు అనుకూలం గా మారారు . 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట రావు పై కేవలం 838 ఓట్ల తేడాతో గెలిచిన వల్లభనేని వంశీ వ్యతిరేకులతో యార్లగడ్డ వెంకటరావు జట్టు కు ప్రయత్నాలు మొదలు పెట్టారు . ఇక కేశినేని చిన్ని కూడా రంగం లోకి దిగారు . స్థానిక తెలుగుదేశానికి మద్దతుగా యువగళం పాదయాత్ర సక్సెస్ కావడానికి కృషి చేస్తున్నారు .
గన్నవరం నియోజకవర్గం లో తెదేపా 1983 (ముసునూరి రత్న బోస్ ), 1985 (ఎం బాలకృష్ణారావు ) , 1994 (గద్దె రామ్మోహన రావు ఇండిపెండెంట్ గా గెలిచి తదనంతరం తెదేపా లో చేరారు ) , 1999 లో దాసరి బాల వర్ధనరావు , 2009 లో తిరిగి దాసరి బలవర్ధన రావు , 2014, 2019 ల లో వల్లభనేని వంశి గెలుపొందారు . ఈ నియోజకర్గం నుంచి మార్క్సిస్ట్ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 1955, 1962, 1978 లలో 3 సార్లు mla గా గెలుపొందారు . ఈ నియోజకవర్గంలో బావులపాడు , విజయవాడ రురల్ , ఉంగుటూరు , గన్నవరం మండలాలు వున్నాయి . ఇది మచిలీపట్టణం లోకసభా పరిధిలోని శాసనసభా స్థానం.
వల్లభనేని వంశీ వైకాపా కు అనుకూలం గా మారినప్పటి నుంచీ గన్నవరం నియోజకవర్గంలో విభేదాలు మొదలయ్యాయి. నియోజకవర్గ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుతో పాటూ మరో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావులతో వర్గపోరు నడుస్తోంది. ఇటీవల అమెరికా నుంచీ వచ్చిన యార్లగడ్డ దుట్టా ను కలిసిన తదుపరి తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . ఇక నారా లోకేష్ బాబు పాదయాత్ర 21 న గన్నవరం నియోజక వర్గంలో జరగనుంది . ఇక గన్నవరం తెదేపా లో కార్యకర్తలు , మండల స్థాయి నాయకులు వున్నా నియోజక వర్గ స్థాయి నాయకులు ” వల్లభనేని వంశీ ని ఢీ అంటే ఢీ అని తలపడే నాయకులు లేరనే చెప్పాలి . ఇప్పటికే యార్లగడ్డ తెదేపా లోకి ప్రవేశానికి రంగం సిద్ధం చేసికొన్నారని , అధినేతను 1 లేదా 2 రోజుల్లో కలుస్తారని తెలుస్తోంది .
ఇక 1999, 2009 లలో తెదేపా అభ్యర్థి గా గెలిచిన దాసరి బాల వర్ధన రావు తిరిగి తెదేపా లో పునః ప్రవేశం చేతారనే వార్తలు వినపడుతున్నాయి . రాబోయే రోజుల్లో గన్నవరం శాసనసభా వైకాపా అభ్యర్థి గా వల్లభనేని వంశీ మోహన్ ఖాయం … ఇక తెదేపా అభ్యర్థి ఎవరైనా ప్రత్యర్థులందరూ కలసి పనిచేయడం కూడా ఖాయం గానే కనిపిస్తోంది . ఈ నేపథ్యం లో ఈ స్థానం లో వంశీ ఎదురీదక తప్పదు .