ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి సొంతగూటికి రావాలని (ఆపరేషన్ ఘర్ వాపసీ ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే .. దీనికితోడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నేతలకు, ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు పునరాలోచనలో పడేశాయన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుండి కమలం కండువా కప్పుకున్న వారిలో చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు టాక్. ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి తాజాగా బయటి నుంచి వచ్చి చేరిన వారికి మధ్య పొసగడం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది, ఇదే సమయంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పి రెండురోజులక్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గతంలో G వెంకటస్వామి తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 3 సార్లు ఎంపీ గా పెద్దపల్లి నుంచీ గెలిచారు . ఆ పార్టీ అధిష్ఠానం ఆయనకు అనేక పదవులతో పాటు సీడబ్ల్యూసీలోనూ సముచిత స్థానం కల్పించింది. వివేక్ కూడా 2009 లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గా పెద్దపల్లి నుంచీ ప్రాతినిధ్యం వహించారు .
అయితే V6 టీవీ ఛానెల్ తో పలు వ్యాపార సంస్థలకు అధినేత ిన వివేక్ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కాంగ్రెస్‌ను వీడి నాటి తెరాస లో చేరారు .. గులాబీ అధినేత కేసీఆర్ వైఖరి నచ్చక కొంతకాలానికే కమలం కండువా కప్పుకున్నారు. కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి బీజేపీలోకి చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలి నచ్చక కొత్త వారేవరూ భాజాపా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు.
గత కొన్నిరోజులుగా కవిత లిక్కర్ కేసు విషయంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ, బీజేపీ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం . దీనితో ఇప్పటికే తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి .. తాజాగా వీటిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ ఇంకా స్పందించలేదు. మరి ఆయన రేవంత్ గూటికి చేరుతాడా బీజేపీలోనే కొనసాగుతాడా అనేది కొంతకాలం వేచిచూడాల్సిందేనని విశ్లేషకుల మాట.