Gannavaram Assembly 2024: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం లో రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి . గన్నవరం లో తెదేపా నుంచీ గెలిచినా వల్లభనేని వంశీ వైకాపా నీడలో అధినేత జగన్ కు సన్నిహితం గా మెలగడం తెలిసిందే. ఆయన తెదేపా అధినేతలపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞులందరినీ ఈ రాజకీయ భాష పట్ల అసహ్యాన్ని కలిగించాయి . గత ఎన్నికల్లో వంశీ గెలిచింది కేవలం 800 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది . ఈ మాత్రం దానికే అధికార యంత్రాంగం , పోలీసు కేసులు అండతో వల్లభనేని వంశీ గత 4 ఏళ్లుగా వైకాపా కు చెందిన దుట్టా , యార్లగడ్డ ల పట్ల ఆయన చూపించిన వైఖరి చివరికి యార్లగడ్డ ను పార్టీ వీడి తెదేపా లో చేరి ఆ పార్టీ కి నియోజక వర్గ ఇంచార్జి అయ్యేట్లు చేసింది .
ఇక గన్నవరం లో వేలాదిగా కార్యకర్తల బలం వున్నా తెదేపా కూడా సరైన నాయకత్వం లేక, ఏమీ చేయలేని పరిస్థితి లో పడింది . నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర సుమారు 5 రోజుల పాటు ఈ నియోజక వర్గం లోనే జరిగింది అంటే తెదేపా ఈ నియోజక వర్గాన్ని యెంత ప్రతిష్టాత్మకం గా తీసుకోండి తెలుస్తుంది . గన్నవరం లో జరిగిన యువగళం బహిరంగ సభలో నారా లోకేష్ చిన్న సైకో అంటూ , రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో కళ్ళకు కట్టినట్లు చెప్పారు . వక్తలపై మరియు 50 మంది తెదేపా నాయకులు , కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగింది . వైకాపా నాయకుల కేసులను తెదేపా ధీటుగా తమ న్యాయ విభాగం ఆధ్వర్యంలో ఎదుర్కొంటున్నారు . నారా లోకేష్ , యార్లగడ్డ వెంకటరావు లపై కేసులు పెట్టడం జరిగింది .
నిజానికి గన్నవరం లో వంశీ కి బలం అధికార యంత్రాంగం తో పాటు కొద్దీ మంది బలగం మాత్రమే . వైకాపా లో గత 10 ఏళ్లుగా నేతగా ఉంటూ 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గా పోటీ చేసిన దుట్టా తో ఇటీవల బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి దుట్టా ను కలిసి మాట్లాడటం జరిగింది . రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వంశీ తో కలసి పని చేసేది లేదని తేల్చి చెప్పారు . ఇదే సంగతి గతం లో వైస్ జగన్ కు కూడా తెలిపానన్నారు . నిజమైన వైకాపా అభిమానులు గన్నవరం లో వంశీ తో అనేక కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపినట్లు సమాచారం .
దాసరి బాలవర్ధన్ రావు గన్నవరం నుండి నాలుగు సార్లు పోటీ చేశారు . 1999 మరియు 2004 లో టిడిపి టిక్కెట్‌పై గెలిచారు. అతను మరియు అతని సోదరుడు జై రమేష్ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు, కానీ పార్టీలో క్రియారహితంగా ఉన్నారు. ఇప్పుడు ఉంగుటూరులో ఎన్టీ రామారావు, బసవతారకం విగ్రహాలను దాసరి కుటుంబం ప్రతిష్ఠిస్తోంది. ఈ వేడుకకు చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబాన్ని ఆహ్వానించి పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి .
నిజానికి వంశీ తెదేపా తో విభేదించి జగన్ కు అనుకూలం గా మారిన తరువాత అతనితో తెదేపా నుంచీ వచ్చిన కొద్దీ మంది తప్పించి వంశీ వెనుక ఎవరూ లేరు . ఈ కొద్దీ మంది కూడా రాబోయే రోజుల్లో తిరిగి తెదేపా లోకి వెళ్లే అవకాశాలు కూడా వున్నాయి . దేనితో వల్లభనేని వంశీ కి దారులు అన్నీ మూసుకుపోయునట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది ….ఇక అధికార వైకాపా కు అభ్యర్థి ని మార్చడం వినా గత్యంతరం లేని పరిస్థితి నెలకొని వుంది . ఏం చేస్తారో వేచి చూడాలి మరి ..