ఖమ్మం : మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న తుమ్మలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ అధినేత తొలి జాబితాను విడుదల చేయడంతో తిరుగుబాటు కు బీజం పడింది . ఇది ఆత్మ గౌరవ సమస్య గా మారింది . నేడు దమ్మపేటలో తుమ్మల అభిమానుల కీలక ఆత్మీయ సమావేశం జరగనుంది. దీనికి తుమ్మల హాజరుకానున్నారు. ఆయన రాజకీయ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు మాత్రం ఆయనను పార్టీలకతీతంగా కలుస్తున్నారు. తుమ్మలకు ప్రజాదరణ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం ప్రారంభమైంది.
25:08/2023 ఖమ్మం :
1000 కార్లు , రెండు వేల మోటారు బైక్ లతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వర రావు కు అభిమానులు , ప్రజలు ఎదురేగి భారీ ర్యాలీ గా స్వాగతం పలికారు . గులాబీ దళపతి తనదైన శైలి లో తుమ్మల రాజకీయ చరిత్రకు చర్మ గీతం పాడాలనుకొన్నారు . ఐతే తానొకటి తలచిన దైవమింకొకటి తలచిన రీతిలో తుమ్మల కు ప్రజలు పాలేరు లో బ్రహ్మ రధం పట్టారు .
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాలేరు నుంచి టికెట్ ఆశించారు .. ప్రస్తుత ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అధిష్టానం సీటు ఖరారు చేసింది. తీవ్ర మనస్థాపం లో వున్న తుమ్మల ను బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావును పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసింది. వీరివురూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు . నిజానికి తుమ్మల నాగేశ్వర రావు కమ్మ సామజిక వర్గానికే కాదు , అన్ని వర్గాల్లో ఆయనకు అభిమానులున్నారు . తుమ్మల వారికి ఎటువంటి స్పందన తెలియచేయకుండా ఈరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు .
తెలుగు దేశం పార్టీ నుంచీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తుమ్మల నాగేశ్వరరావు 1983 ఎన్నికల్లో ఓడిపోయారు. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరగా.. ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం దక్కింది. ఆ తర్వాత నుంచి పాలేరు నియోజకవర్గంపై తుమ్మల ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తుమ్మల 13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెదేపా లో ఎన్టీఆర్ , చంద్రబాబు ల మంత్రివర్గాల్లో పనిచేశారు . తెలంగాణ రాష్ట్రం లో 3 ఏళ్లపాటు కెసిఆర్ మంత్రివర్గం లో పనిచేశారు .
కార్యకర్తల , అభిమానుల ఆదరణ చూసి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు . మీ కోసమే రాజకీయాలు తప్ప.. నాకు పాలిటిక్స్ అవసరమే లేదు. నాకు పదవి అధిపత్యం కోసమో, అలంకారం కోసమో కాదు. నన్ను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారు. కానీ.. నేను ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. ఎక్కడా తలవంచేది లేదు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. మీ కీర్తి కోసం, ఆత్మాభిమానం కోసం నిలబడతా. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా. అసలైన పనులు పూర్తి చేసి.. మీతో శెభాష్ అనిపించుకుంటా.” అన్నారు తుమ్మల నాగేశ్వరావు . ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామన్నారు .