Sunday, December 22, 2024
spot_img
HomeElections 2023-2024 కొడంగల్ బరిలో  కొదమ సింహం “రేవంత్ రెడ్డి “ ..పాలమూరు లో కాంగ్రెస్ హవా !?

 కొడంగల్ బరిలో  కొదమ సింహం “రేవంత్ రెడ్డి “ ..పాలమూరు లో కాంగ్రెస్ హవా !?

Combined Mahaboob Nagar District Politics: 115 అసెంబ్లీ సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి గులాబీ బాస్ ఎన్నికల గోదా లోకి దూకారు . తెలంగాణ కాంగ్రెస్ మినహా ఇతర ప్రతిపక్షాల పాత్ర రాబోయే ఎన్నికల్లో పెద్దగా వుండే అవకాశం లేదు . అత్యాశకు పోయిన ఉభయ కమ్యూనిస్ట్ సోదర పార్టీలకు కెసిఆర్ నుంచీ ఎదురైన అవమానానికి, వారు  ప్రతీకారం తీర్చుకొంటాం అని శపధాలు చేస్తున్నారు . ఇక భాజాపా తెలంగాణా లో భారాసాకు బి టీం గా మారింది అని ఆ పార్టీ నుంచీ పొలోమని బయటకు వస్తున్న నాయకులు చెప్తున్న మాట . 

9 ఏళ్ళు అధికారం లో వున్న భారాసాకు హ్యాట్రిక్ విజయానికి తెలంగాణా లో అడ్డంకి  గా వున్న ఏకైక రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ నే  . తెలంగాణ కాంగ్రెస్ లో కోవర్టులకు కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టింది . రేవంత్ రెడ్డి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టి , రాష్ట్ర వ్యాప్తం గా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్ని నింపుతున్నారు . కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో తనకు గల విభేదాలను పక్కన పెట్టి కదనోత్సాహం తో ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టారు . పార్టీ కి ఒకింత ఇబ్బంది  గా వున్న 35 నియోజకవర్గాల్లో భారాసా ను నిలువరించే అభ్యర్థుల వేటలో పడ్డారు . 

ఉమ్మడి నల్గొండ మరియు ఖమ్మం  జిల్లాల్లో గల అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యం గా తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే పనిచేస్తోంది .  ఇక 14 అసెంబ్లీ స్థానాలు వున్న ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడి సొంత జిల్లా . ఈ జిల్లా లో 14 కు 14 స్థానాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేయని రేవంత్ రెడ్డి ధ్యేయం గా పెట్టుకొన్నారు .. ఆ దిశగానే కొల్హాపూర్ కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , కుచ్చుకుంట్ల దామోదర్ రెడ్డి MLC కుమారుడు కాంగ్రెస్ లో ఇప్పటికే చేరారు . 

Revanth Reddy in Kodangal


ఇక కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచీ రేవంత్ రెడ్డి పోటీ కి సిద్ధమవుతున్నారు, సీటు కోసం దరఖాస్తు చేసుకొన్నారు  . కొడంగల్ మాజీ mla గుర్నాథ రెడ్డి ని చేర్చుకొని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశారు . ఇక నిన్న రోజంతా కొడంగల్ నియోజకవర్గం లోనే రేవంత్ గడిపి స్థానికం గా బలమైన నేతలను పార్టీ లోకి చేర్చుకొన్నారు . ఇందులో కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ ముఖ్ , కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప, ఎంపీటీసీలు వున్నారు . రేవంత్ రెడ్డి రానున్న ఎన్నికల సమరం లో తెలంగాణ వ్యాప్తం గా ప్రచారం చెయ్యాల్సి వుంది . అందుకే తన స్థానాన్ని పదిలం చేసుకొంటున్నారు . ఇక అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 26 న చేవెళ్ల బహిరంగ సభ లో కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్  ప్రకటించ నున్నారు . ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేగం గా వేస్తున్నారని చెప్పాలి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments