రేవంత్ సొంత ఇలాకా అభివృద్ధి కోసం ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కొడంగల్ లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేసే లిస్ట్ ఇదే
గతేడాది నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అదే డిసెంబర్ లో ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డిసెంబర్‌లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా ఇవ్వాళ తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో సహా రూ.3 కోట్లతో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో రూ.2,945 కోట్లతో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని స్టార్ట్ చేయడం కూడా ఉంది. ఐతే గత పదేళ్ల కెసిఆర్ పాలనలో డవలప్ మెంట్ కు నోచుకోని కొడంగల్ నియోజకర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే ఐదేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేసేలా రేవంత్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. గత డిసెంబర్ 29న వికారాబాద్ కలెక్టర్ నేతృత్వంలో కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్నారు. కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రేవంత్ సైన్యం కొడంగల్ సభ కోసం భారీ కాన్వాయ్ లతో బయలుదేరినట్లు సమాచారం.
కొడంగల్ లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేసే లిస్ట్ ఇదే…
ఇవాళ కొడంగల్ లో సీఎం రేవంత్ ప్రారంభించనున్న శంకుస్థాపన వివరాలు
–> 6.8 కోట్ల రూ లతో.. R&B అతిథి గృహం
–> 262 కోట్ల రూ లతో.. సింగిల్‌లేన్ హైవే విస్తరణ
–> 54 కోట్ల రూ లతో.. డబుల్‌లేన్ రోడ్లు
–> 54 కోట్ల రూ లతో.. వంతెనలు
–> 27 కోట్ల రూ లతో.. బిటి రోడ్లు
–> 213 కోట్ల రూ లతో.. హైలెవల్ వంతెనలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం
–> 3 కోట్ల రూ లతో… హస్నాబాద్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్
–> 40 కోట్ల రూ లతో… NREGS కింద CC రోడ్లు
–> 5 కోట్ల రూ లతో… విద్యాశాఖకు సంబంధించి హాస్టల్ భవనం
–> 25 కోట్ల రూ లతో… మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనం
–> 25 కోట్ల రూ లతో… బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, నీటూరులోని జూనియర్ కళాశాల
–> 7 కోట్ల రూ లతో… దౌల్తాబాద్‌లో జూనియర్ కళాశాల
–> 7 కోట్ల రూ లతో… బొమరస్‌పేటలోని జూనియర్ కళాశాల
–> 20 కోట్ల రూ లతో… మద్దూరు ఎస్సీ సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల
–> 25 కోట్ల రూ లతో… కొడంగల్‌లో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల
–> 11 కోట్ల రూ లతో… కోస్గిలో మహిళల డిగ్రీ కళాశాల
వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు.