తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు 15 చోట్ల గెలవాలి అని టార్గెట్ పెట్టుకున్న రేవంత్ సర్కార్ .ఇప్పటికే అభ్యర్థుల ఎంపికై కసరత్తు చేసింది తెలంగాణ కాంగ్రెస్ . ఎవరు ఏ అబ్యర్థి అయితే గెలుస్తాడు అనే అంశంపై పూర్తీ కసరత్తు చేసినట్లు సమాచారం ,లోక్ సభ సమరానికి సై అంటున్న తెలంగాణ కాంగ్రెస్ అన్ని విధాలా సిద్దమయ్యింది . మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ఆల్ రెడీ మొన్న జరిగిన కొడంగల్ బహిరంగ సభలో ప్రకటించేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకా కొడంగల్ నుంచి చేసిన ఈ ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒక జోష్ కనిపిస్తోంది. లోక్ సభ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి విదితమే.. వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తూనే సీఎం రేవంత్ తొలి లోక్ సభ అభ్యర్థి పేరును ప్రకటించారు .
జాతీయ కాంగ్రెస్ పార్టీ పద్దతి ప్రకారం స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తరువాత మహబూబ్ నగర్ అభ్యర్థి గెలుపు గుర్రం చల్లా వంశీ చంద్ రెడ్డి పేరుని ప్రకటించారు సీఎం రేవంత్ . తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు 15 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు సీఎం రేవంత్ . గత బారాసా ప్రభుత్వ హయాములో నాయకులు అధికారులు అవినీతి ఆరోపణలతో కురుకుపోయారు ,ప్రాజెక్టులపై మాట్లాడటానికి అసెంబ్లీ సభా సమేవేశాలకు సైతం రాలేని స్థితిలో జాతిపిత గులాబీ దళపతి కెసిఆర్,ఇవి అన్ని గమనిస్తున్న తెలంగాణ ప్రజలు 17 ఎంపీ స్థానాలకు 15 కాదు 17 కు 17 గెలిపించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని రాజకీయ విశ్లేషకుల అంటున్నారు . ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం , కాంగ్రెస్ పెద్దల నుంచి పూర్తి స్వేచ్చ తీసుకుని ఎంపీ అభ్యర్థులను గెలుపు గుర్రాలను ప్రకటించేస్తున్నారు. అసలు ఇంతకీ కాంగ్రెస్ పార్లమెంట్ రేసు గుర్రాలు గెలుపు గుర్రాలు ఎవరు? ఎవరు ఎక్కడనుంచి పోటీచేసే అవకాశం దక్కనుంది తెలుసుకుందాం
దాదాపు ఖరారు అయినా కాంగ్రెస్ లోక్ సభ సభ్యుల పేర్లు …
మహబూబ్ నగర్ – చల్లా వంశీ చంద్ రెడ్డి (లోక్ సభ అభ్యర్థి)
నాగర్ కర్నూలు – సంపత్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే) లేదా మల్లు రవి(కాంగ్రెస్ సీనియర్ నేత)
చేవెళ్ల- పట్నం సునీతారెడ్డి(వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్)
మెదక్- మైనంపల్లి హనుమంతరావు (మాజీ ఎమ్మెల్యే)
జహీరాబాద్ – సురేశ్ షెట్కార్ (మాజీ ఎంపీ)
ఆదిలాబాద్ – రేఖా నాయక్ (మాజీ ఎమ్మెల్యే)
నిజామాబాద్ – జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబాబాద్ – బలరాం నాయక్(కేంద్ర మాజీ మంత్రి)
కరీంనగర్ – ప్రవీణ్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), రాజేందర్ రావు
వరంగల్ – అద్దంకి దయాకర్
పెద్దపల్లి – వెంకటేశ్ నేత (సిట్టింగ్ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా మల్లు నందిని
నల్గొండ – జానారెడ్డి (మాజీ మంత్రి), పటేల్ రమేశ్ రెడ్డి
భువనగిరి – కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి(డాక్టర్), చామల కిరణ్ కుమార్ రెడ్డి
సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్ (మాజీ మేయర్)
మల్కాజ్ గిరి – కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ )
హైదరాబాద్ – సమీర్ ఉల్లా(మైనార్టీ నేత)
సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక్కసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిరాగానే, ఏఐసీసీ నుంచి, ఢిల్లీ పెద్దల నుండి పూర్తి అనుమతి తీసుకుని మిగతా అభ్యర్థులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు ,ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ లక్కీ ఛాన్స్ త్వరలోనే తేలిపోతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు