తెలంగాణ రాష్ట్రం నర్సంపేట మండలం పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డిని ఓక మహిళ చెప్పుతో కొట్టడం ఇపుడు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది . అసలు వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మండలం పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బారాసా పార్టీ గులాబీదళంలో గంజాయి మొక్కగా ఉంటూ ఆరు నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తు మాట్లాడుతున్నారు . ఈ నేపథ్యంలో ఇది తెలిసిన గులాబీ పార్టీ పెద్దలు రెండు నెలల క్రితం బారాసా నుంచి మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసింది.
మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి లోకి రావడాన్ని లోకల్ గ ఉన్న కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో,నువ్వు పార్టీ మారుతావా అంటూ,జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను నడిరోడ్డు మీద చెప్పుతో కొట్టింది. మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సమీప బంధువు.
నర్సంపేట మండలం పీఏసీఎస్ చైర్మన్ ను,ఓ ఎమ్మెల్యే బంధువు, అయిన మోహన్ రెడ్డి ని ఓ మహిళ చెప్పుతో కొట్టడం అనే సంఘటన అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో ను చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి .