Saturday, December 21, 2024
spot_img
HomeElections 2023-2024పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ దే విజయం పీపుల్స్‌పల్స్‌ సర్వే

పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ దే విజయం పీపుల్స్‌పల్స్‌ సర్వే

తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా ఐతే విజయం సాధించిందో… అదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగనుందా? అంటే అవుననే సమాధానం పలు సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలుండగా ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుందో తాజాగా తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 8 నుంచి పది పార్లమెంటరీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటుతుందని ఈ సర్వే వెల్లడించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఇక ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 3 నుంచి 5 స్థానాలు దక్కుతాయని, అదే విదంగా బీజేపీ పార్టీకి 2 నుంచి 4 పార్లమెంట్‌ సీట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి 40 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది

The People’s Pulse Survey has concluded that the Congress has won the Parliament elections..?

అయితే.. గతేడాదితో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ 1 శాతం ఓట్లు, బీజేపీ 9 శాతం ఓట్లు అధికంగా పొందుతుండగా.. ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం 6 శాతం ఓట్లు కోల్పోతోందని పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ అంచనా వేసింది. ఇక.. కాంగ్రెస్‌ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సర్వే పేర్కొంది. అధికారంలోకి వచ్చాక మహిళలకు మహాలక్ష్మి స్కీం ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. సో.. మహిళల ఓట్లు హస్తానికి ఎక్కువ పడొచ్చనే ధీమా ఆ సర్వే వెల్లడించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 17 వరకు ట్రాకర్‌ పోల్‌ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ట్రాకర్‌ పోల్‌ సర్వే కోసం.. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4,600 శాంపిల్స్‌ సేకరించిన ఆధారంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చేసిందని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments